ఇదేందిరబ్బీ!
సాక్షి, భీమవరం : జిల్లాలో రబీ సాగు జాప్యమవుతోంది. ఖరీఫ్ కలిసిరాక, కూటమి ప్రభుత్వ సహకారం అందక దాళ్వా పెట్టుబడులు పెట్టేందుకు చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. డిసెంబరు నెలాఖరుకు నాట్లు పూ ర్తిచేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు సుమారు 20 శాతం విస్తీర్ణంలో మాత్రమే నాట్లు పడ్డాయి.
కష్టాలు మిగిల్చిన ఖరీఫ్
గత ఖరీఫ్ సీజన్ రైతులకు కష్టాలు, నష్టాలనే మిగి ల్చింది. జిల్లాలోని 2.05 లక్షల ఎకరాల్లో సాగు చే యగా జూలైలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, వరదలకు తాడేపల్లిగూడెం, పెంటపాడు, ఆకివీడు, తణుకు తదితర చోట్ల 38 వేల ఎకరాల్లోని నాట్లు, నారుమడులకు, 500 ఎకరాల్లోని ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. అప్పటికే ఎకరాకు రూ.12 వేల వరకు పెట్టుబడులు కాగా రెండోసారి నాట్లు వే యాల్సి రావడంతో పెట్టుబడులు రెట్టింపయ్యాయి. మరలా కోతలు సమయంలో ఫెంగల్ తుపాను పరుగులు పెట్టించింది. కామన్ రకం ధాన్యం 75 కేజీల బస్తాకు రూ.1,725లు మద్దతు ధర కాగా తేమశాతం పేరిట దళారులు, మిల్లర్లు రూ.200లు నుంచి రూ.300ల వరకు కోతపెట్టడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల వ రకు దిగుబడి రావాల్సి ఉండగా పంట తెగుళ్లు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో 30 బస్తాలలోపే ది గుబడులు రావడంతో చాలామంది రైతులకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఎదురైంది.
ప్రభుత్వం మొండిచేయి
రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు సాయం కొరవడింది. జిల్లాలోని 86,610 మంది రైతులకు విడతకు రూ.2 వేల చొప్పున రెండు పర్యాయాల్లో కేంద్ర ప్రభుత్వం రూ.34.64 కోట్ల పీఎం కిసాన్ సాయం మాత్రమే అందింది. కూటమి ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన అన్నదాత సుఖీభవ సాయం అందించలేదు. తొలకరి పంట నష్టపోయిన రైతులకు కనీసం బీమా పరిహారం కూడా అందించకపోగా రబీ నుంచి ఎకరాకు రూ.615లు చొప్పున బీమా ప్రీమియం భారాన్ని రైతులపై మోపింది.
రబీలో సాగుచేసే రకాలు
రబీ సీజన్‌లో శ్రీధృతి (ఎంటీయూ–1121), తరంగిణి (ఎంటీయూ–1156), చంద్ర (ఎంటీయూ–1153), ఎంటీయూ 1010 (కాటన్ దొర సన్నాలు), ఎంటీయూ–3626 (ప్రభాత్), నెల్లూరు మషూరి (ఎన్‌ఎల్‌ఆర్–34449) తదితర రకాలను సాగు చేస్తుంటారు. వీటి సాగు కాలం 120 నుంచి 125 రోజుల వరకు ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఏప్రిల్ నెలాఖరు లేదా మే మొదటి వారం వరకు సాగు జరిగే అవకాశం ఉందని అంచనా. సాగు చివర్లో ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన నాట్లు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
దాళ్వా సా..గుతోంది
రైతులకు నష్టాలు మిగిల్చిన ఖరీఫ్
అందని ప్రభుత్వ సాయం
దాళ్వా పెట్టుబడులకు సొమ్ములు లేక సతమతం
జిల్లాలో 2.22 లక్షల ఎకరాల విస్తీర్ణం
ఇప్పటివరకు 20 శాతమే నాట్లు పూర్తి
గతేడాది జనవరి మొదటి వారంలోనే 60 శాతానికి పైగా పూర్తి
సాగు జాప్యం.. రైతు సతమతం
జిల్లాలో 2.20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రబీ వరి సాగవుతుందని అంచనా. మున్ముందు ఎండల తీవ్రత, నీటి ఎద్దడి సమస్యతో పంటకు నష్టం కలగకుండా సకాలంలో సాగు పూర్తిచేసేందుకు డిసెంబరు నెలాఖరు నాటికి నాట్లు పూర్తిచేయాలని, వెదజల్లు పద్ధతిని అవలంభించే వారు డిసెంబరు మొదటి వారంలోపు విత్తుకోవాలని మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఇప్పటికే సూచించారు. గతేడాది జనవరి మొదటి వారం నాటికి 60 శాతానికి పైగా నాట్లు పడగా ప్రస్తుతం 20 శాతం విస్తీర్ణం మేర నాట్లు పూర్తయినట్టు అంచనా. ముందుగా కోతలు మొదలైన తాడేపల్లిగూడెం రూరల్ ప్రాంతంలో దా దాపు నాట్లు పూర్తి కాగా తణుకు, ఇరగవరం, పెంటపాడు, పెనుమంట్ర తదితర చోట్ల పనులు ముమ్మరమవుతున్నాయి. ఖరీఫ్ చివరిలో కురిసిన వర్షాలకు తోడు పెట్టుబడులకు సొమ్ములు లేక సాగు జాప్యమవుతోందని రైతులు అంటున్నారు. జనవరి చివరి వారం వరకు నాట్లు పడే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment