ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీపై అవగాహన
పాలకొల్లు సెంట్రల్ : ఏపీఎస్‌ఆర్టీసీ కార్గో పార్శి ల్, కొరియర్ రవాణా సేవల్లో భాగంగా డోర్ డెలివరీ సౌకర్యం కల్పించామని ఉమ్మడి జిల్లాల కార్గో మేనేజర్ జి.లక్ష్మీ ప్రసన్న వెంకట సుబ్బారావు అన్నారు. సోమవారం పాలకొల్లు పొట్టి శ్రీరాములు బస్టాండ్ కార్గో పార్శిల్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డిసెంబర్ 20 నుంచి ఈనెల 19 వరకు నెలపాటు డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. మాసోత్సవాల్లో భా గంగా బుకింగ్ చేసిన వినియోగదారుల ఎల్‌ఆర్‌లను డ్రా తీసి విజేతలకు బహుమతులు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా డోర్ డెలివరీలో రాష్ట్రంలో రెండో స్థానంలో, ఏలూరు జిల్లా 5వ స్థానంలో ఉందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా లో గతేడాది కార్గో ద్వారా రూ.195 కోట్ల ఆ దాయం వచ్చిందన్నారు. డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎ.శివప్రసాద్ పాల్గొన్నారు.
జల సంరక్షణ ప్రాజెక్టులపై శ్రద్ధ
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలో జలశక్తి అభియాన్ ద్వారా చేపట్టిన జల సంరక్షణ ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జలశక్తి అభియాన్ సెంట్రల్ నోడల్ అధికారి, అగ్రికల్చర్, ఫార్మర్స్ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్‌తో ఆమె సమావేశమయ్యారు. జిల్లాలో జలశక్తి పనుల పురోగతిని పరిశీలించేందుకు కేంద్ర బృందం ఆకివీడు, ఉండి మండలాల్లో పర్యటిస్తుందన్నారు. జిల్లాలో పనుల పురోగతిపై జేఎస్‌ఏ జిల్లా అధికారి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు వివరించారు. సెంట్రల్ నోడల్ అధికారి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ జిల్లాలో జలశక్తి అభియాన్ కింద చేపట్టిన పనుల పురోగతి బాగుందని, ఇదే స్ఫూర్తితో పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. జేఎస్‌ఏ శాస్త్రవేత్త మౌనిక పాల్గొన్నారు.
నేడు మున్సిపల్ కమిషనర్ల సమావేశం
తాడేపల్లిగూడెం: జిల్లాలోని మున్సిపల్ కమిషనర్ల సమావేశాన్ని మంగళవారం పట్టణంలోని బలుసులమ్మ కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు. పురపాలన శాఖ ప్రాంతీయ సంచాలకుడు (రాజమహేంద్రవరం) సమీక్ష నిర్వహిస్తారని మున్సిపల్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment