స్పందన
శునకాలపై సర్వే
నిడమర్రు: ‘సాక్షి’లో సోమవారం ప్రచురించిన ‘వికృతంగా వీధి కుక్కలు’ శీర్షికన కథనానికి పశుసంవర్ధకశాఖ అధికారులు స్పందించారు. నిడమర్రులో స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్న శునకాలపై సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్టు పెదనిండ్రకొలను వెటర్నరీ వైద్యుడు శ్రీనివాస సందీప్ తెలిపారు. నిడమర్రు గ్రామంలో మొత్తం 25 వరకూ కుక్కలు స్కిన్ అలర్జీతో బాధపడుతున్నట్టు గుర్తించామన్నారు. పెంపుడు కుక్కల యజమానులు తమను సంప్రదిస్తే తక్ష ణం సూది మందు, ట్యా బ్‌లెట్ల రూపంలో మందులు ఇస్తామని చెప్పారు. ఏహెచ్‌ఏలు మారుతి, నవ్య, హైమ, వెటర్నరీ సహాయకులు రమణ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment