కర్షకులకు కలుపు కష్టాలు
చట్టాలపై అవగాహన అవసరం
చింతలపూడి: జైలులో ఖైదీలకు చట్టాలపై అవగాహన అవసరమని జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్ మధుబాబు అన్నారు. చింతల పూడిలో సబ్ జైలును ఆయన సందర్శించారు.
ఆదివారం శ్రీ 19 శ్రీ జనవరి శ్రీ 2025
సాక్షి, భీమవరం: రబీలోనూ రైతులను ఖరీఫ్ కష్టాలు వెంటాడుతున్నాయి. గుర్రపుడెక్క, కలుపు రూపంలో పంటలకు నష్టాలు కలిగిస్తున్నాయి. ఇప్పటికే పెట్టుబడులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతుంటే కలుపు నివారణకు అదనపు వ్యయమవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలో 50 శాతం మేర నాట్లు
జిల్లాలోని 2.22 లక్షల ఎకరాల్లో రైతులు రబీ సాగు చేస్తున్నారు. ఇప్పటివరకు 50 శాతం మేర నాట్లు పూర్తికాగా నెలాఖరు నాటికి 90 శాతం పూర్తవుతాయని వ్యవసాయాధికారుల అంచనా. అధిక శాతం విస్తీర్ణంలో ఎంటీయూ 1121 రకం సాగు చేస్తుండగా, మిగిలిన చోట్ల పీఆర్ 126, ఎంటీయూ 1153, ఎంటీయూ 1156 రకాలను సాగు చేస్తున్నారు. ముందుగా సాగు ప్రారంభించిన తాడేపల్లిగూడెం, తణుకు, పెంటపాడు ప్రాంతాల్లో వరి పైరు మూనలు వేస్తోంది. కాగా ప్రస్తుతం రబీ రైతులను పొలాల్లో గుర్రపుడెక్క, కలుపు సమస్య తీవ్రంగా వెంటాడుతోంది.
పెట్టుబడులు తడిసిమోపెడు
ఖరీఫ్ కలిసిరాక, ప్రభుత్వం నుంచి భరోసా, పంట నష్టపరిహారం సాయం అందక రబీ పంటకు పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్న రైతులకు కలుపు సమస్య తలనొప్పిగా తయారైంది. రెండు పర్యాయాలు దమ్ముచేసి నాట్లు వేసిన తర్వాత పలుచోట్ల పొలాల్లో గుర్రపుడెక్క, పాదులు మొలుస్తుండటంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో రైతులు ఉన్నారు. రెండుసార్లు కలుపు మందు కొట్టినా ఫలితం లేదని, మందు ప్రభావంతో వరిపైరు ఎండిపోతోందని చెబుతున్నారు. కలుపు నివారణ కోసం చేపడుతున్న చర్యలతో పెట్టుబడులు పెరిగిపోతున్నాయని వాపోతున్నారు.
న్యూస్‌రీల్
గుర్రపుడెక్క ముంచేను
తొలకరిలో భారీ వర్షాలు, వరదలతో నీటమునిగిన చేలు
డ్రెయిన్లలోంచి పొలాల్లోకి చేరిన గుర్రపుడెక్క
దాళ్వాలో కలుపు రూపంలో రైతులకు అవస్థలు
మందులు పిచికారీ చేస్తున్నాఫలితం లేదంటున్న రైతులు
ఇప్పటికే పెట్టుబడులకు సొమ్ముల్లేక ఇక్కట్లు
జిల్లాలో 2.22 లక్షల ఎకరాల్లో రబీ సాగు
ముంపు తెచ్చిన కలుపు
ఖరీఫ్ పంటకు ఎన్నడూ లేనివిధంగా నాట్లు దశలోనే భారీ వర్షాలు, వరదలు నష్టం కలిగించాయి. 2.05 లక్షల ఎకరాల్లో తొలకరి సాగు చేయగా ఆగస్టు చివరిలో కురిసిన భారీ వర్షాలకు వయ్యేరు, ఎర్రకాలువ, యనమదుర్రు, ఉప్పుటేరు ముంపుతో పెంటపాడు, అత్తిలి, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకోడేరు, కాళ్ల. ఆకివీడు తదితర మండలాల్లోని 18 వేల ఎకరాల్లోని నాట్లు, 30 వేల ఎకరాలకు చెందిన నారుమడులు దెబ్బతిన్నాయి. ఆయా ప్రాంతాల్లో రెండోసారి నాట్లు, నారుమడులు వేయాల్సి వచ్చింది. మరోసారి గోదావరి, కొల్లేరుకు వచ్చిన వరదలు అత్తిలి, పాలకోడేరు, పెంటపాడు, తణుకు, ఆకివీడు, కాళ్ల, నరసాపురం మండలాల్లోని పొలాలను ముంచెత్తి పంటకు అపార నష్టం కలిగించాయి. ముంపు నీటితో గుర్రపుడెక్క, పిచ్చిమొక్కలు పొలాల్లోకి చేరి మేటలు వేశాయి. ముందుకు సాగలేని పరిస్థితుల్లో జిల్లాలో దాదాపు 14 వేల ఎకరాలను రైతులు ఖరీఫ్ సాగు చేయకుండా ఖాళీగా వదిలేశారు.
రెండు సార్లు కలుపు మందు కొట్టినా..
15 ఎకరాలు కౌలు సాగు చేస్తున్నా. తొలకరిలో రెండుసార్లు పొలాలు ముంపుబారిన పడ్డాయి. ఏడు ఎకరాల్లో పంట బాగా దెబ్బతినడంతో సాగు చేయలేక ఖాళీగా వదిలేశాం. ప్రభుత్వం నుంచి సాయం ఏమీ అందలేదు. ఇప్పుడు దాళ్వా సాగు చేస్తే పొలంలో గుర్రపుడెక్క, చెత్త పెరిగిపోతోంది. రెండుసార్లు కలుపు మందు కొట్టినా ఫలితం లేదు. మందు ప్రభావానికి పైరు మాడిపోతోంది.
– ఆర్తి నాగేశ్వరరావు, కౌలురైతు, ఈడూరు
Comments
Please login to add a commentAdd a comment