మద్యం తాగి వ్యక్తి మృతి
ఆకివీడు: స్థానిక అయిభీమవరం రోడ్డులో ఎకై ్సజ్ సర్కిల్ ఆఫీసుకు కూతవేటు దూరంలో జల్సా మద్యం షాపు ఆవరణలో మద్యం సేవించి శనివారం ఓ వ్యక్తి మృతి చెందాడు. కొల్లిగడ్డి ముని (55) అనే వ్యక్తి రెండు రోజులుగా మద్యం అతిగా తాగడంతో మృతిచెందాడని స్థానికులు చెబుతున్నారు. మద్యం షాపు వెనుక భాగంలో భారీగా సిట్టింగ్‌కు ఏర్పాటుచేయడంతో మందుబాబులు విచ్చలవిడిగా తాగుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సిట్టింగ్ ప్రాంతంలో అన్నీ సమకూర్చడంతో అర్ధరాత్రి వరకూ ఇక్కడే ఉంటూ మద్యం తాగుతున్నారని అంటున్నారు. ఏ సమయంలో అయినా మద్యం అందుబాటులో ఉండటంతో పలువురు అతిగా తాగి రోడ్లపై పడిపడుతున్నారని, మరికొందరు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రాందీ షాపుల వద్ద అనధికార సిట్టింగులు ఉన్నా ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోవడంలేదని అంటున్నారు. ఎకై ్సజ్ అధికారులు దాడులు చేసి, సిట్టింగులు తొలగించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment