పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం
భీమవరం (ప్రకాశంచౌక్): స్వచ్ఛ పశ్చిమగోదావరి జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం భీమవరం ఆదర్శనగర్ పార్కులో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో కలిసి ఆమె ప్రారంభించారు. పార్కులో చెత్తను వారు తొలగించి శు భ్రం చేశారు. పరిశుభ్రత, ప్లాస్టిక్ అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమాజ ఆరోగ్యానికి పరిసరాల పరిశుభ్రత దోహదపడుతుందన్నారు. భీమవరం పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం కోసం అందరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలను ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నారన్నారు. అనంతరం స్వచ్ఛతపై ప్రజలు, అధికారులు, సిబ్బంది, నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ నాగరాణి
Comments
Please login to add a commentAdd a comment