అలరించిన నృత్య ప్రదర్శన
భీమవరం (ప్రకాశంచౌక్): మావుళ్లమ్మ ఆలయ వార్షిక మహోత్సవాల్లో భాగంగా కళాంజలి నృత్యనికేతన్ (పాలకొల్లు) కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
కలుపు నివారణలో జాగ్రత్తలు తప్పనిసరి
పొలాల్లో గుర్రపు డెక్క సమస్యపై మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్ర వేత్త డా. ఎంవీ కృష్ణాజీని సంప్రదించినప్పుడు చేసిన సూచనలు ఆయన మాట ల్లోనే.. కలుపు నివారణలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. నీరు, సూర్యరశ్మి కోసం కలుపు మొక్కలు పొలంలోని ప్రధాన పంటతో పోటీ పడి నష్టం కలుగజేస్తాయి. నిర్ణీత సమయంలో, నిర్ణీత మోతాదులో మందును వినియోగించి నివారణ చర్యలు చేపట్టాలి. లేకుంటే కలుపు నివారణ సరిగా జరగకపోగా సాగు ఖర్చు పెరిగిపోతుంది. సిఫార్సు చేయని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందులను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. పారాక్వాట్, గ్లైఫోసేట్ కొన్ని రకాల కలుపు మందులు పంట, కలుపు అనే విచక్షణ శక్తి లేక అన్ని మొక్కలను పూర్తిగా నాశనం చేస్తాయి. ఎండ ఎక్కువగా ఉన్నపుడు, గాలి ఎక్కువగా వీస్తున్నపుడు కలుపు మందులు పిచికారీ చేయ కూడదు. ఉదయం, సాయంత్రం వేళల్లో గాలి తక్కువగా ఉన్నపుడు పిచికారీ చేయాలి. గాలికి ఎదురుగా పిచికారీ చేయకూడదు. గుర్రపుడెక్క నివారణకు ఎకరాకు 400 గ్రా. 2,4 డీ సోడియం సాల్ట్ లేక 400 మీ.లీ 2,4 డీ అమైన్ సాల్ట్ కలుపుపై పడేలా పిచికారీ చేయాలి
Comments
Please login to add a commentAdd a comment