ధాన్యం సొమ్ముల జమలో జాప్యం
కాళ్ల: తాము అమ్మిన ధాన్యానికి సొమ్ములు ఇప్పించాలంటూ దొడ్డనపూడికి చెందిన రైతులు కాళ్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. దొడ్డనపూడికి చెందిన కొందరు రైతులు పది రోజుల క్రితం కాళ్ల సొసైటీ ద్వారా ఆఫ్‌లైన్ లో గ్రామంలోని లక్ష్మీ బాలాజీ రైస్ మిల్లుకు ధాన్యాన్ని తోలారు. దాదాపు ఏడున్నర ఎకరాలకు సంబంధించిన ధాన్యం సొమ్ములు జమచేయడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారని, అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదంటూ రైతులు వాపోతున్నారు. ఇక్కడకు వస్తే తహసీల్దార్ అందుబాటులో లేరని, ధాన్యం సొమ్ములు చేతికందక పోవడంతో దాళ్వా పంట పెట్టుబడులకు అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 48 గంటల్లోపు ధాన్యం సొమ్ములు చెల్లిస్తామని చెప్పారని, తమకు మాత్రం న్యాయం జరగడం లేదని వాపోయారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు ధాన్యం సొమ్ములు ఇప్పించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment