కూటమి నేతల సంబరాలు ఎందుకో? | - | Sakshi
Sakshi News home page

కూటమి నేతల సంబరాలు ఎందుకో?

Published Sun, Jan 19 2025 12:31 AM | Last Updated on Sun, Jan 19 2025 12:31 AM

-

తాడేపల్లిగూడెం (టీఓసీ): విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ప్యాకేజీ ఇచ్చిన విషయంలో కూటమి నేతలు సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కావడంలేదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మోనిటరింగ్‌ కమిటీ సభ్యుడు చీకటిమిల్లి మంగరాజు అన్నారు. పట్టణంలో మాల మహానాడు ఆధ్వర్యంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో కార్మికులు జీతాలు సరిగా ఇవ్వడం లేదని, 25 వేల మంది కార్మికులకు గాను 10 వేల మందితో ప్లాంట్‌ నడుస్తోందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌కు హాలిడే ప్రకటించి, ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, సొంతంగా గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ విశాఖకు వచ్చిన సమయంలో ప్రకటించిన ప్యాకేజీ ఇప్పుడు కేంద్ర మంత్రులు ప్రకటించడం వెనుక మతలబు ఏంటో అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆలోచన విరమించాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు తిరగటి శివ, మాల మహానాడు రాష్ట్ర నేత డి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement