భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఈనెల 20 నుంచి 31వ తేదీ వరకు అన్ని మండలాల్లో రోజుకు రెండు పంచాయతీల చొప్పున పశు వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా గ్రా మాల్లో ఉదయం 8 గంటల నుంచి శిబిరాలు నిర్వహిస్తామని, పశువులకు సాధారణ చికిత్సలు, గర్భకోస వ్యాధులకు పరీక్షలు చేసి మందులు అందిస్తామన్నారు. కృత్రిమ గర్భాధారణ, గర్భ నిర్ధారణ పరీక్షలు చేస్తారన్నారు. అలాగే నట్టల నివారణ మందులు, బొబ్బ వ్యాధి నివారణ టీకాలు వేస్తామన్నారు. అలాగే జంతు సంక్షేమంపై అవగాహన కల్పిస్తారన్నారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉపాధి హామీ ద్వారా పశుగ్రాసాల పెంపకం, జాతీయ లైవ్ స్టాక్ మిషన్‌పై అవగాహన కల్పిస్తామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment