20న మెగా షుగర్ వైద్య శిబిరం
భీమవరం: యూకే–ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు మెమోరియల్ ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్స శిబిరాన్ని ఈనెల 20న భీమవరం డీఎన్నార్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఆవరణలో నిర్వహించనున్నట్టు దివంగత కేంద్ర మంత్రి కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తెలిపారు. శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ వేణు కవర్తపు (లండన్) ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం షుగర్ బాధితులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందిస్తామన్నారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి, డాక్టర్ పీఆర్‌కే వర్మ మాట్లాడుతూ పలు దేశాలకు చెందిన సుమారు 40 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు సేవలందింస్తారని, రోగులు ముందుగా సెల్ 96763 09926, 99893 42009, 94904 32934 నంబర్లలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. డీఎన్నార్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు) తదితరులు పాల్గొన్నారు.
అవగాహనతోనే కుష్టు నివారణ
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఈనెల 20 నుంచి వచ్చేనెల 2 వరకు కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు డీఎంహెచ్‌ఓ బి.భానూనాయక్ తెలిపారు. భీమవరంలో శనివారం కార్యక్రమ పోస్టర్లు ఆవిష్కరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిఒక్కరినీ పరీక్షించాలని వైద్య సిబ్బందికి సూచిం చారు. అనుమానిత కేసులు ఉంటే పీహెచ్‌సీల్లో పరీక్షలు చేయించాలన్నారు. కుష్టుని ఆరంభంలో గుర్తిస్తే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చన్నారు. డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, అధికారులు జి.గణపతిరావు, బి.రామానుజరావు, టి.పుష్పరాణి పాల్గొన్నారు.
రంజింపజేసిన ‘రాగ–సాగర’
ఆకివీడు: మనసును హత్తుకునేలా, వినూత్నంగా విశ్వంభర రాగ సాగర ఆధ్యాత్మిక రాగాన్ని గణపతి సచ్చిదానంద స్వామీజీ వినిపించారు. స్థానిక దత్త క్షేత్రంలో మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ శనివారం వి శ్వంభర రాగ సాగర అనే నూతన సంగీత వా యిద్యాన్ని విన్పించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సంగీతం ద్వారా దీర్ఘ వ్యాధులను పారదోలవచ్చన్నారు. తమ ఆరఽశమం ద్వారా ఎందరికో ఇలా నయం చేశామన్నారు. అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన రాగ–సాగర కార్యక్రమాన్ని ఆకివీడులో ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజల పుణ్యమన్నారు. ఆలయాల్ని, ఆశ్రమాల్ని, క్షేత్రాల్ని ప్రజలు పరిరక్షించుకో వాలని పిలుపునిచ్చారు. స్థానిక దత్త క్షేత్రానికి రూ.కోటి విరాళంగా అందజేయడం, రాగ–సాగర ద్వారా మరో రూ.50 లక్షల ఆదాయం సమకూరడం ఆనందంగా ఉందన్నారు. ఈ మొత్తాన్ని ఆకివీడు క్షేత్రంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు. ఆధ్యాత్మికత తో దేనినైనా జయించవచ్చని, ఆయుధం కన్నా ఆధ్యాత్మికత విన్న అని స్వామీజీ అన్నారు. దత్త క్షేత్ర కార్యదర్శి కంభంపాటి త్రినాథ కృష్ణమూర్తి, ట్రస్టీలు, భక్తులు పాల్గొన్నారు.
హెల్మెట్‌తో ప్రాణ రక్షణ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): చిన్న తప్పిదంతో జీవితాన్ని కోల్పోవడం, అంగవైకల్యం పొందడం జరుగుతుందని, వాహనచోదకులతో పాటు స హ ప్రయాణికులు తప్పనిసరిగా హెల్మెట్ ధ రించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చై ర్మన్, ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. పురుషోత్తంకుమార్ హితవు పలికారు. ఏలూరులో న్యాయమూర్తి పురుషోత్తంకుమార్ అధ్యక్షతన హెల్మెట్ ధారణ–ప్రమాదాల నివారణ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ధారణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, శనివారం న్యాయశాఖ ఉద్యోగస్తులు, న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. కారులో ప్రయాణించేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment