ఆటోడ్రైవర్‌పై అరకమ కేసులు దుర్మార్గం
తణుకు అర్బన్: వైఎస్ జగన్ అభిమాని, ఆటో డ్రైవర్ పంజా దుర్గారావును తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నడిరోడ్డుపై అటకాయించి దౌర్జన్యం చేయడమే కాకుండా పోలీసులతో అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ లీగల్ టీం సభ్యుడు, మాజీ ఏపీపీ వెలగల సాయిబాబారెడ్డి విమర్శించారు. దుర్గారావును శుక్రవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 41 నోటీసు ఇచ్చి విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయిబాబారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అతి సామాన్యుడైన ఆటో డ్రైవర్‌పై ఎమ్మెల్యే స్థాయిలో విరుచుకుపడి అక్రమ కేసు కట్టించి ఆయన స్థాయిని దిగజార్చుకున్నారని ఎద్దే వా చేశారు. తాను చేస్తున్న అక్రమాలపై నోరెత్తకుండా భయపెట్టే క్రమంలో ఎమ్మెల్యే ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడటాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. దుర్గారావుపై పెట్టిన అక్రమ కేసులో తమ వద్ద ఉన్న సాక్ష్యాల ప్రకారం ప్రైవేటు కేసు వేస్తామని ఎవరు ఎవరిని వెంటాడి, వేధించారో తేలుస్తామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తణుకు ప్రాంతంలో అక్రమ కేసులు కట్టించడం హేయమైన చర్యగా పరిగణించాలన్నారు. తేతలిలో పశువధ శాలకు అనుమతులు లేకున్నా ఎమ్మెల్యే ఆరిమిల్లి అండగా ఉంటూ పోలీసులను కాపలా పెట్టించి మరీ నడుపుతున్నారని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంపై ప్రజలంతా చీదరించుకున్నారన్నారు. పశువధ శాల విషయంలో పోలీసులు, రెవెన్యూ విభాగాలు పూర్తిగా విఫలమయ్యారని, వీరిపై లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రైవేటు కేసులు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని, త్వరలో హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేయనున్నట్టు చెప్పారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అమలుచేస్తే మా బుక్ మేము కూడా తెరుస్తామని హెచ్చరించారు.
దుర్గారావుకు స్వాగతం
మధ్యాహ్నం 3 గంటలకు తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వచ్చిన దుర్గారావుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు స్వాగతం పలికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడు తూ ఆపద సమయంలో అండగా నిలిచిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జ్ కారుమూరి సునీల్‌కుమార్, వైఎస్సార్‌సీపీ శ్రేణులందరికీ రుణపడి ఉంటానని అన్నారు. పెరవలి ఎంపీపీ కాచ్చెర్ల ప్రసాద్, వైఎస్సార్‌సీపీ పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పొట్ల సురేష్, నాయకులు వి.సీతారాం, వైఎస్సార్‌సీపీ తణుకు, పెరవలి పార్టీ శ్రేణులు ఉన్నారు.
ఎమ్మెల్యే ఆరిమిల్లివి కవ్వింపు చర్యలు
వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ సభ్యుడు సాయిబాబారెడ్డి ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment