పేదల గూడుకు ఎసరు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
జిల్లాలో మంజూరు చేసిన ఇళ్లు
మండలం స్థలాల నిర్మాణాలు
మంజూరు మొదలుకానివి
కాళ్ల 360 2
పాలకొల్లు 1,037 13
తాడేపల్లిగూడెం 4,402 176
మొగల్తూరు 669 30
భీమవరం 7,453 3,983
యలమంచిలి 754 63
గణపవరం 769 18
పెంటపాడు 1,357 14
ఇరగవరం 1,281 29
వీరవాసరం 871 57
ఆచంట 1,311 17
పోడూరు 1,866 13
పెనుమంట్ర 272 12
ఉండి 1,721 36
అత్తిలి 1,590 116
పెనుగొండ 2,080 33
పాలకోడేరు 1,782 8
తణుకు 9,068 28
నరసాపురం 3,753 81
ఆకివీడు 2,966 112
సాక్షి, భీమవరం: సెంటు భూమి సేకరించి పేదలకు పంచిన దాఖలాలు లేని చంద్రబాబు స ర్కారు ఇప్పుడు పాత పంథానే అనుసరిస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు పొంది గృహాలు నిర్మించుకోలేని నిరుపేదల పట్టాల రద్దుకు నిర్ణయించింది. పేదలకు ఇళ్ల స్థలాలు పేరిట తిరిగి వాటిని తమ అనుచరులకు కట్టబెట్టే ఎత్తుగడ వేసింది.
గత ప్రభుత్వంలో 47 వేలకు పైగా
స్థలాలు అందజేత
సొంతిళ్లు లేని పేదలు ఉండకూడదన్న లక్ష్యంతో కులం, మతం, పార్టీలు చూడకుండా.. రాజకీయం చేయకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రికార్డు స్థాయిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. మనుపెన్నడూ లేనివిధంగా జిల్లాలో మెరక పనులు పూర్తయిన మేర 626 లేఅవుట్లలో 47,362 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశా రు. సొంత స్థలం ఉన్న 22,757 మందికి హౌసింగ్ సాయం మంజూరు చేశారు. ఇంటి నిర్మాణానికి రూ.1.8 లక్షల సాయం మంజూరుకే పరిమితం కా కుండా జగనన్న కాలనీల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకున్నారు. ప దేళ్ల తర్వాత ఇంటిపై సర్వహక్కులు ఉండేలా లబ్ధి దారుల పేరిట స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి కన్వెన్షన్ డీడ్ అందజేసే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించి లబ్ధిదారుల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో రూ.609.46 కోట్ల వ్యయంతో 30,205 ఇళ్ల ని ర్మాణం పూర్తి కాగా మిగిలినవి పునాది, రూఫ్ తదితర దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. 4,841 స్థలాల్లో ఇంకా గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టలేదు.
ఖాళీ స్థలాలపై కూటమి కన్ను: ఎన్నికల్లో ఊదరగొట్టి గద్దెనెక్కాక సూపర్ సిక్స్ వాగ్దానాలను గాలికొదిలేసి పేదలను వంచించిన కూటమి ప్రభుత్వం వారి సొంతింటి ఆశలను చిదిమేస్తోంది. ఇప్పటికే స్థలాలు పొంది ఆర్థిక ఇబ్బందులతో ఇళ్ల నిర్మాణం చేసుకోని వారి స్థలాలపై కన్నేసింది. పాత కేటాయింపులు రద్దుచేసి తమ వారికి కొత్త కేటాయింపులు చేసే పనిలో ఉంది. రెండు రోజుల క్రితం జరిగిన కేబినేట్ సమావేశంలో ఇళ్లు కట్టుకోని వారి స్థలాల రద్దుకు నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా లోని 4,841 నిరుపేదల సొంతింటి ఆశలు ఆవిరికానున్నాయి. ఈ స్థలం ఉందన్న భరోసాతో వీరిలో పిల్లల పెళ్లిళ్లు చేసిన వారు, వైద్యం కోసం అప్పులు చేసిన వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నిరుపేదలకు ప్రభుత్వం ఇవ్వాల్సింది పోయి లాక్కోవాలని చూడటం సరికాదని కూటమి సర్కారు తీరును పలువురు విమర్శిస్తున్నారు.
తణుకులోని జగనన్న కాలనీలో ఇళ్లు
కూటమి గూడుపుఠాణి
ఇళ్లు నిర్మించుకోని వారి స్థలాల కేటాయింపుల రద్దుకు నిర్ణయం
వాటిని తమ మద్దతుదారులకు ఇచ్చేందుకు ప్రణాళిక
గత ప్రభుత్వంలో జిల్లాలో 47,362 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ
రద్దు కానున్నవి 4,841 పట్టాలు !
ఆందోళనలో లబ్ధిదారులు
ఈ ప్రభుత్వానికి పెట్టే మనసు లేదు
పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని దివంగత వైఎస్సార్ మొదలు పెట్టారు. పదేళ్ల తర్వాత వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి తండ్రికి మించిన తనయునిగా, దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి రూ.35 వేల కోట్లు వెచ్చించి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. శాశ్వత హక్కు కల్పిస్తూ పట్టాలను రిజిస్ట్రేషన్ చేయించారు. ఇప్పుడు పేదలకు ఇచ్చిన స్థలాలను కూటమి ప్రభు త్వం లాక్కోవాలని చూడటం దుర్మార్గం. పేదలకు ఇచ్చేటటువంటి మనస్తత్వం లేదు.. ఇవ్వాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. పేదవర్గాల వారికి ఎప్పుడూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది.
–ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వ నిర్ణయం సరికాదు
పేదలకు అండగా ఉండి వారి సొంతింటి కలను సాకారం చేయాల్సింది పోయి గతంలో పంపిణీ చేసిన స్థలాలను ప్రభుత్వం తిరిగి లాక్కోవాలనుకోవడం సరికాదు. స్థలం ఉందన్న భరోసాతో తమ పిల్లల పెళ్లిళ్లు చేసిన వారు ఎంతోమంది ఉన్నారు.
– ఝాన్సీ లారెన్స్, తణుకు
Comments
Please login to add a commentAdd a comment