ఆర్థిక లావాదేవీలతోనే ఆక్వా వ్యాపారి కిడ్నాప్
భీమవరం: అతనొక వడ్డీ వ్యాపారి. తెలిసిన వారి వద్ద తక్కువ వడ్డీకి పెద్ద మొత్తంలో సొమ్ములు తీ సుకుని ఇతరులకు ఎ క్కువ వడ్డీకి ఇస్తుంటా రు. అలాగే ఆక్వా వ్యా పారం చేస్తుంటారు. ఇ లా సుమారు రూ.40 కో ట్ల వరకు అప్పులు చేశా రు. తిరిగి చెల్లించకపోవ డంతో అప్పులిచ్చిన కొందరు సినీ పక్కీలో ఆయ న్ను కిడ్నాప్ చేసి ఆస్తులు రాయించుకోవాలని చేసిన ప్రణాళిక బెడిసి కొట్టి చివరకు పోలీసులకు చిక్కా రు. స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం భీమవరం డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య విలేకరులకు వివరాలు వెల్లడించారు.
అనంతపురం ముఠాతో ఒప్పందం
భీమవరానికి చెందిన విశ్వనాథుని వెంకట నారాయణ (నాని) పట్టణానికే చెందిన సోమిశెట్టి ఆర్‌కే సత్యప్రసాద్, ఇన్నమూరి లక్ష్మీవెంకట మల్లికార్జున సురేష్‌బాబు వారి బంధుల వద్ద కరోనా విపత్తు సయమంలో అప్పు తీసుకున్నారు. సకాలంలో చెల్లించకపోవడంతో 2021లో వడ్డీతో సహా రూ.10.70 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అప్పటి నుంచి సొమ్ము చెల్లించాలని నానిపై ఒత్తిడి చేసినా ఫలితం లేదు. దీంతో నానిని కిడ్నాప్ చేయాలని సత్యప్రసాద్, సురేష్‌బాబు పథకం రచించారు. సత్యప్రసాద్ అనంతపురంలోని ముదిగుబ్బ ప్రాంతానికి చెందిన కాకతీయ రెస్టారెంట్ యజమాని ఆశీష్‌ను సంప్రదించారు. తమకు రావాల్సిన మొ త్తంలో 10 శాతం కిరాయిగా ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఆశీష్ తనకు తెలిసిన లోకేష్ ను సంప్రదించాడు. వీరిద్దరూ అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముంతిమగుడు గ్రామానికి చెందిన అరవ భగవాన్ (యోహాన్), గుత్తి మండలం ఎంగిలిబండకి చెందిన బాల నాగేంద్రబాబు, తొండపాడుకి చెందిన మునగాల హరికృష్ణ, నల్ల మాడు మండలం రాగానిపల్లి తండాకి చెందిన బు క్కే దివాకర్ నాయక్, రుధం మండలం చోలే మ ర్రికి చెందిన బోయే రాము, కడపలోని సంకరాపు రం ప్రాంతానికి చెందిన మేఘావత్ చరణ్, రాజేష్, గోవర్ధన్‌లను ముఠాగా చేసి నానిని కిడ్నాప్ చేసేందుకు ఈనెల 16న అంతా సిద్ధం చేశారు.
పోలీసుల అదుపులో కిడ్నాప్ ముఠా
వివరాలు వెల్లడించిన డీఎస్పీ జయసూర్య
పక్కాగా రెక్కీ చేసి.. పోలీసులమని కారులోకి ఎక్కించి..
పథకంలో భాగంగా ముందుగా సత్యనారాయణ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి భీమవరం టౌన్ రైల్వేస్టేషన్ వద్దకు కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళుతున్న సత్యనారాయణను మరో కారులో వెంబడించారు. సత్యనారాయణ కుటుంబసభ్యులు రైల్వేస్టేషన్ లోపలికి వెళ్లగా కారు వద్ద ఉన్న సత్యనారాయణను పోలీసులమని చెప్పి బలవంతంగా వీరి కారులో ఎక్కించుకుని అనంతపురం తీసుకువెళ్లారు. సత్యనారాయణ తన ఆస్తులు అమ్మి డబ్బు చెల్లిస్తానని చెప్పడంతో అక్కడి నుంచి ఈనెల 18న తిరిగి భీమవరం తీసుకురావడంతో.. గరగపర్రు రోడ్డులో ఉన్న సురేష్‌బాబు, ముఠాలోని అరవ భగవాన్, బాల నాగేంద్రబాబు, బుక్కే దివాకర్‌నాయక్, మునగాల హరికృష్ణ, బోయే రాము, మేఘావత్ చర ణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి మూడు కార్లు, 9 సెల్‌ఫోన్లు, ఒక డైరీ, వాకీటాకీ, చాకు, మూడు క్రికెట్ వికెట్స్, రెండు హాకీ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ జయసూర్య చెప్పారు. నిందితుల్లో సోమిశెట్టి ఆర్‌కే సత్యప్రసాద్, ఆశీష్, లోకేష్, రాజేష్, గోవర్ధన్ పరారీలో ఉన్నారని డీఎస్పీ వివరించారు. కేసును గంటల వ్యవధిలో ఛేదించిన టుటౌన్ సీఐ జి.కాళీచరణ్, ఎస్సై ఫజుల్ రహమాన్, ఇశ్రాయేలు, ఎన్.గోపి, టి.ముత్యాలరాజులను డీఎస్పీ అభినందించి రివార్డులు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment