అమిత్‌షాను బర్తరఫ్ చేయాలి
భీమవరం: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబే డ్కర్‌ను అవమానపర్చిన కేంద్ర హోం మంత్రి అ మిత్‌షా రాష్ట్ర పర్యటనకు వ్యతిరేకంగా భీమవరంలో ఆదివారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ని రసన ప్రదర్శన నిర్వహించారు. అమిత్‌షా గో బ్యాక్ అనే నినాదంతో సీపీఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యు డు చింతకాయల బాబూరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్ మాట్లాడుతూ అంబేడ్కర్‌ను అవమానించిన అమిత్‌షాకు రాష్ట్రంలో అడుగు పెట్టే అర్హత లే దన్నారు. అంబేడ్కర్ గురించి హేళన చేసి మా ట్లాడం దుర్మార్గమన్నారు. అమిత్‌షాను మంత్రివ ర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, పార్లమెంట్ సాక్షిగా ప్రజలకు అమిత్‌షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీపీఐ కార్యదర్శి చెల్లబోయిన రంగారావు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడవడానికి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు లంకా కృష్ణమూర్తి మాట్లాడుతూ అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్‌కుమార్, ఏపీ బహుజన జేఏసీ నాయకుడు బిరుదుగడ్డ రమేష్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ, మామిడిశెట్టి రామాంజనేయులు, బాతిరెడ్డి జార్జి, పుల్లారెడ్డి, మల్లిలపూడి రామాంజనేయులు, చెల్లబో యిన వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment