జీజీహెచ్‌లోకలెక్టర్‌తనిఖీలు
ఏలూరు టౌన్ : ఏలూరు సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్)లో క్షీణించిన పారిశుద్ధ్యంపై ఆదివారం ‘సాక్షి’లో ‘జీజీహెచ్‌లో పారిశుద్ధ్యం అధ్వానం’ శీర్షికన ప్రచురించిన కథనానికి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్పందించారు. మధ్యాహ్నం జీజీహెచ్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్రెయినేజీ వ్య వస్థను పరిశీలించారు. ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు, ఏలూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, బోధనాస్పత్రి ఇంజనీరింగ్ అధికారులను వెంట బెట్టుకుని జీజీహెచ్ ప్రాంగణంలో డ్రెయినేజీ పరిస్థితులపై చర్చించారు. ఆస్పత్రిలోని ఎంసీహెచ్ బ్లాక్ భవనం ప్రవేశ మార్గం వద్ద వీల్‌చైర్స్ కోసం ర్యాంపు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అలాగే మురుగునీరు పారుదల సక్రమంగా సాగేలా చర్యలు చేపట్టాలని, పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. బోధనా స్పత్రి మ్యాప్‌ను సైతం ఆమె పరిశీలించి పనులకు సూచనలు ఇచ్చారు. అత్యవసర పనుల ప్రాతిపదికన అంచనాల ప్రతిపాదనలు రూపొందించాలన్నా రు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య పరిస్థితులను రోజూ పర్యవేక్షించాలనీ లేకుంటే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, కార్పొరేషన్ ఈఈ జి.సురేంద్రబాబు, తహసీల్దార్ జీవీ శేషగిరి ఆమె వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment