హెల్మెట్ ధారణ తప్పనిసరి
భీమవరం (ప్రకాశంచౌక్): ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధారణ తప్పనిసరి అని రవాణా తనిఖీ అధికారులు అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం భీమవరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భీమవరం రవాణా కార్యాలయానికి చెందిన అధికారులు పాల్గొని వాహనచోదకులకు రోడ్డు భద్రత, నియమ, నిబంధనలను వివరించారు. నాలుగు చక్రాల వా హన డ్రైవర్ తప్పనిసరిగా సీట్‌బెల్ట్ పెట్టుకోవా లని, ఇన్స్యూరెన్స్ పొల్యూషన్ రిజిస్ట్రేషన్ పత్రా లు తప్పనిసరిగా వెంట ఉండాలని సూచించా రు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడపడం ప్రమాదకరమన్నారు. హెల్మెట్ ధరించి వాహనం నడుపుతున్న వారితో మాట్లాడి వారి అనుభవాన్ని అందరికీ తెలియజేశారు. సీఎంవీ రూల్ 104 ప్రకారం వాహనం ముందు, వెనుక భాగాల్లో రేడియం స్టిక్కర్స్ లేని వాహనాలకు వాటిని అంటించారు. రవాణా తనిఖీ అధికారులు కె.ప్రసాద్, ఎం.రవికుమార్, ఎన్‌ఎల్‌ఎస్ లక్ష్మి, ఏఎస్‌పి తేజ పాల్గొన్నారు.
రేపటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు
భీమవరం (ప్రకాశంచౌక్) : జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల పిల్లల నమోదుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక మొబైల్ ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈనెల 21 నుంచి 24 వరకు, 27 నుంచి 30 వరకు ఆరేళ్లలోపు పిల్లల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో మొత్తంగా 90 ఆధార్ కేంద్రాల ద్వారా క్యాంపులు నిర్వహిస్తామన్నారు. మండలాల వారీగా ఆచంటలో 2, ఆకివీడులో 4, అత్తిలిలో 3, భీమవరంలో 6, యలమంచిలిలో 4, గ ణపవరంలో 5, ఇరగవరంలో 3, కాళ్లలో 4, మొగల్తూరులో 4, నరసాపురంలో 3, పాలకొల్లులో 3, పాలకోడేరులో 3, పెనుగొండలో 3, పెనుమంట్రలో 3 పోడూరులో 4, తాడేపల్లిగూడెంలో 3, తణుకులో 6, ఉండిలో 3, వీరవాసరంలో 4 ఆధార్ కేంద్రాలను ఏర్పాటుచేస్తామన్నారు. అలాగే అర్బన్ మండలాల్లో భీమవరంలో 4, నరసాపురంలో 4, పాలకొల్లులో 3, తాడేపల్లిగూడెంలో 3, తణుకులో 6 ఆధార్ కేంద్రాలను ఏర్పాటుచేశామని కలెక్టర్ తెలిపారు.
విద్యుత్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ మినహాయింపు
డీటీఓ ఉమామహేశ్వరరావు
భీమవరం (ప్రకాశంచౌక్): విద్యుత్ బైకులు, కార్లకు జీవిత పన్ను (లైఫ్ టాక్స్) మినహాయింపు ఇస్తున్నట్టు జిల్లా రవాణా అధికారి టి.ఉమామహేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల నుంచి మినహాయింపు అమలులోకి వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం విద్యుత్ వాహనాల ద్వారా కాలుష్యం తగ్గించవచ్చుని సమీక్షించి పన్ను మినహాయింపునకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో కొనుగోలు చేసిన, రిజిస్టర్ చేసుకున్న అన్ని స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నును మినహాయిస్తూ ఐదేళ్ల కాల పరిమితికి (జనవరి 2025 నుంచి జనవరి 2030 వరకు) ఉత్తర్వులు జారీ చేశారన్నారు. పన్ను మినహాయింపు హైబ్రిడ్ వాహనాలకు వర్తించదన్నారు. అలాగే ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ టీఆర్ జారీ చేసిన, ఆంధ్రప్రదేశ్‌లోని డీలర్లు ఇతర రాష్ట్రాలకు టీఆర్‌లు జారీచేసిన వాహనాలకు పన్ను మినహా యింపు వర్తించదని పేర్కొన్నారు.
రాట్నాలమ్మా పాహిమాం
పెదవేగి : భక్తులపాలిట కొంగు బంగారం రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తా రు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణలో చిన్నారులకు అన్నప్రాసనలు, నామకరణలు, అక్షరాభ్యాసాలు చేయించారు. దేవస్థానానికి పూజా టికెట్లపై రూ.42,720, విరాళాల రూపంలో రూ.11,953, లడ్డూ ప్రసాదంపై రూ.21,750, ఫొటోల అమ్మకం ద్వారా రూ 3,475 మొత్తంగా రూ.79,898 ఆదాయం సమకూరిందని ఈఓ ఎన్.సతీష్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment