లేసుకు ప్రోత్సాహకాలు కరువు
ప్రపంచ ఖ్యాతిగాంచిన నరసాపురం లేసు పరిశ్రమకు బడ్జెట్‌లో ప్రోత్సాహం ఇస్తారని భావించాం. అయితే నిరాశే ఎదురైంది. కొన్ని నిర్ణయాల కారణంగా లేసు ఎగుమతులు మరింత భారమవ్వడం, ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం వంటివి జరుగుతాయనే సంకేతాలు ఆందోళన కలిగిస్తోంది. లేసు ఎగుమతులకు చైనా నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నాం. కేంద్ర ప్రోత్సాహకాలు లేకపోతే పరిశ్రమ మనుగడ కష్టం.
– కావలి నాని, అంతర్జాతీయ
లేసు ఎగుమతిదారుడు, నరసాపురం
పేదలకు వ్యతిరేకంగా బడ్జెట్
కేంద్ర బడ్జెట్ పూర్తిగా పేదలకు వ్యతిరేకంగా ఉంది. రైతులు, దళితులు, బడుగు, బలహీన వర్గాలకు మొండిచేయి చూపారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ ఊసేలేదు. ధరల స్థిరీకరణకు నిధులు కేటాయింపులు లేవు. కార్మిక సంక్షేమం మాటలేదు. నిరుద్యోగ సమస్య నిర్మూలన, యువతకు ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యం లేదు.
– కోనాల భీమారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి, భీమవరం
పన్ను రాయితీ హర్షణీయం
బడ్జెట్‌లో ఆక్వా ఎగుమతులపై పన్ను రాయితీ ప్రకటించడం హర్షణీయం. అయితే రాయితీలు హేచరీలు, ఫీడ్ తయారీ కంపెనీలకు మాత్రమే చేరుతున్నాయి. రైతుల వరకూ చేరేలా చూడాలి. గతంలో రాయితీలు ప్రకటించినా రైతులకు ప్రయోజనం చేకూరలేదు. ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వ ఫలాలు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలి.
– గాదిరాజు వెంకట సుబ్బరాజు,
ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి,
ప్రజారంజకంగా బడ్జెట్
బడ్జెట్ ప్రజారంజకంగా ఉంది. ఆరోగ్య రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుని అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ ఆస్పత్రు లు ఏర్పాటు చేయనుండటం అభినందనీయం. ఆదాయ పన్నుపై రూ.12 లక్షల వరకు మినహాయింపు మేలు చేస్తుంది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేశారు.
– ఐనంపూడి శ్రీదేవి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment