తీరంలో తాబేళ్ల మృతిపై విచారణ
భీమవరం(ప్రకాశం చౌక్): మృతి చెందిన తాబేళ్లు సంఘటనపై వెంటనే విచారణ చేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో అటవీ, మత్స్యశాఖల అధికారులతో సమావేశమై మృతిచెందిన తాబేళ్లు చినమైనివారిలంక, పెద్దమైనివారిలంక తీర ప్రాంతానికి కొట్టుకు రావడానికి కారణాలపై సమీక్షించారు. పర్యావరణ హితమైన సముద్ర జీవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లాలోని తీర ప్రాంతానికి పదుల సంఖ్యలో మృత తాబేళ్లు కొట్టుకురావడం ఆందోళన కలిగించే అంశం అన్నారు. అటవీ, మత్స్య, పశుసంవర్ధక శాఖల అధికారులతో విచారణ బృందాన్ని నియమించినట్టు చెప్పారు. తాబేళ్లు గుడ్లు పెట్టే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వలలను నిషేధించాలని మత్స్యకారులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా మత్స్య శాఖ అధికారి ఆర్‌వీఎస్ ప్రసాద్, జిల్లా అటవీ శాఖ అధికారి డి.ఆశాకిరణ్, మత్స్యశాఖ సహాయ సంచాలకుడు సీహెచ్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
పింఛన్ల పంపిణీ : కాళ్ల: కోపల్లె ఎస్సీ కాలనీ, కాళ్ల బీసీ కాలనీలో పలువురు లబ్ధిదారులకు కలెక్టర్ నాగరాణి పింఛన్లు పంపినీ చేశారు. లబ్ధిదారుల యోగక్షేమాలు తెలుసుకుని, ప్రతినెలా పింఛన్ పంపిణీ తీరును అడిగి తెలుసుకున్నారు. డీఆర్‌డీఏ పీడీ ఎంఎస్‌ఎస్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
పాఠశాలల పునర్వ్యవస్థీకరణపై దృష్టి
భీమవరం: ప్రభుత్వ పాఠశాలల పునర్వ్యవస్థీకరణపై తల్లిదండ్రులు, వెనుకబడిన కులాలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు, పాఠశాలలు పునర్వ్యవస్థీకరణపై సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment