ధైర్యంగా నిలబడే వ్యక్తి
సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడే వ్యక్తి ఇలా ఆత్మహత్య చేసుకున్నారంటే నమ్మలేకపోతున్నాను. ఆయన స్నేహానికి విలువిచ్చే వ్యక్తి. వెయ్యి మందికి సమాధానం చెప్పగలడు. పోలీసు ఉద్యోగమే వ్యసనంగా భావించే వారు. మాకు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ధైర్యం చెప్పే వ్యక్తి ఇక లేరంటే నమ్మలేకపోతున్నాం.
– వెంకటరమణ,
కె.గంగవరం, తూర్పుగోదావరి జిల్లా
ఒత్తిడి పెరిగింది అనే వారు
కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులు, అధికారులపై ఒత్తిడి పెరిగిందని, మనశ్శాంతిగా విధులు నిర్వర్తించలేకపోతున్నా మని ఎస్సై మూర్తి అనేవారు. కోర్టులో కలిసిన సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసేవారు. గేదెల చోరీ ఘటనలో సస్పెండ్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. జుడీషియల్ విచారణ, ఉన్నతాధికారుల ఒత్తిడితో ఇబ్బంది పడ్డారు.
– వెలగల సాయిబాబారెడ్డి,
వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ సభ్యుడు, తణుకు
●
Comments
Please login to add a commentAdd a comment