ఫుడ్ కోర్టు వద్దు.. బయటి ఫుడ్ ముద్దు
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు క్యాంపస్‌లో ఉన్న ఫుడ్‌కోర్టును రెండు రోజుల పాటు బాయ్‌కాట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విద్యార్థులు ఒకరికొకరు ఎని మిది వేల మందికి వాట్సాప్‌లో సందేశాలు పంపించుకున్నారు. అంతేగాకుండా డైనింగ్ హాళ్ల వద్ద ‘ఎఫ్‌సీ వద్దు... అవుట్‌సైడ్ ఫుడ్ ముద్దు.. శని, ఆదివారాలు ఫుడ్‌కోర్టును బాయ్‌కాట్ చేద్దాం’ అంటూ పోస్టర్లను అంటించారు. దీంతో ఈ వ్యవహారం ట్రిపుల్‌ఐటీలో సంచలనంగా మారింది. గతంలో ఉన్న ఫుడ్‌కోర్టు నిర్వాహకులను ఏకపక్షంగా రద్దు చేసి, నూతన నిర్వాహకులకు ఫుడ్‌కోర్టును ఇచ్చినప్పటికీ ఏమాత్రం నాణ్యత పెరగకపోవడంపై విద్యార్థులు ఇలా వినూత్నంగా నిశ్శబ్ద నిరసన (సైలెంట్ ప్రొటెస్ట్) చేపట్టారు. విద్యార్థులు ఎవరైనా ఫుడ్‌కోర్టుకు వెళ్లినా ఏమీ కొనకుండా అక్కడ కూర్చోండని, రెండు రోజులు ఏమీ కొనకుండా నిరసన తెలిపితే సమస్యలు పరిష్కారమవుతాయంటూ ఫోన్‌లకు పంపుతున్న సందేశాల్లో పేర్కొన్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు శనివారం ఫుడ్‌కోర్టుకు వెళ్లలేదు. నిశ్శబ్ద నిరసన ఆదివారానికి మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment