గండ్ల గుదిబండ
గతేడాది ఆగస్టు 31న కురిసిన భారీ వర్షాలకు నూజివీడులోని పెద్ద చెరువుకు గండ్లు పడి రోడ్లు సైతం ధ్వంసమయ్యాయి. ఇంత వరకు ఆ గండ్లు పూడ్చలేదు. 8లో u
కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి బ్యాంకర్లను కోరారు. జిల్లా కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాల్‌లో బుధవారం బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జిల్లా వార్షిక రుణ ప్రణాళికను రూ.24,003 కోట్ల లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఇందుకు బ్యాంకర్లు రుణాలు మంజూరులో తమ వంతు సహకారాన్ని అందించి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ప్రాధాన్యత రంగాలకు రూ 20,473 కోట్లు రుణాలు లక్యంగా నిర్ణయించగా వాటిలో తక్కువ కాలవ్యవధి వ్యవసాయ రుణాలకు రూ.8,899 కోట్లుకి గాను 5,083 కోట్లు ఇప్పటివరకు మంజూరు చేసినట్లు చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ 4,235 కోట్లుకి గాను రూ.2,960 కోట్లు మంజూరు చేశారని, వ్యవసాయ సాంకేతిక పరికరాలు తదితరాలకు రూ.1,019 కోట్లు నూరు శాతం మంజూరు చేశారని మిగతా లక్ష్యాలను మార్చిలోగా పూర్తి చేయాలన్నారు. ఎగుమతులతో కలిపి ఎంఎస్‌ఎంఈకి రూ.5,295 కోట్లుకి గాను రూ.4,183 కోట్లు మంజూరు చేశారని, ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ.1,025 కోట్లుగా, అలాగే ప్రాధాన్యేతర రరంగాలకు రూ.3,530 కోట్ల రుణాలు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. రుణాల మంజూరు లక్ష్య సాధనలో డిసెంబరు నెలాఖరు నాటికి వివిధ వ్యవసాయ రుణాలు ఇప్పటివరకు ఖరీఫ్, రబికి 23,000 మంది లబ్ధిదారులకు సీపీర్సి కార్డుల ద్వారా రూ.180 కోట్లు కౌలు రైతులకు రుణాలు మంజూరు చేశారని, ఇంకా ఎక్కువగా లక్ష్య సాధనకు బ్యాంకర్ల సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment