ఏఎంసీ ఆవరణలోనే శాశ్వత కలెక్టరేట్‌కు కృషి
భీమవరం: జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఏఎంసీ ఆవరణలోనే కలెక్టరేట్ శాశ్వత భవనాలు నిర్మించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు స్పష్టం చేశారు. కలెక్టరేట్ తరలింపు, పర్మినెంట్ భవనాలు నిర్మాణాలపై జరుగుతున్న ప్రచారంపై బుధవారం అఖిలపక్ష నాయకులు భీమవరంలో మోషన్‌రాజును కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఏర్పాటు, శాశ్వత భవనాల నిర్మాణం కోసం మార్కెట్ యార్డులో స్థల కేటాయింపు చేస్తూ జీవో నెం.124 జారీ చేశారని, 20 ఎకరాల భూమిని కేటాయించి రెవెన్యూ శాఖకు బదలయించారని చెప్పారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కలెక్టరేట్ స్థలం మార్పుపై మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతుందని దీనిపై స్పష్టత ఇవ్వాలని, కలెక్టరేట్ ఏఎంసీ ప్రాంతంలోనే ఉండే విధంగా కృషిచేయాలని శాసనమండలి చైర్మన్, ఎమ్మెల్యేలను కోరగా వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఏఎంసీ ఆవరణలోనే కలెక్టరేట్ ఉంటుందని శాసనమండలి చైర్మన్ మోషేనురాజు భరోసా ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చినమిల్లి వెంకట్రాయుడు, గాదిరాజు రామరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, చింతకాయల బాబురావు, చెల్లబోయిన రంగారావు, బి వాసుదేవరావు, మల్లుల సీతారాం ప్రసాద్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment