నరసాపురం రూరల్: శిక్షణ పొందిన మహిళలు పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని జాయింట్ టి కలెక్టర్ రాహుల్‌కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం స్థానిక అంతర్జాతీయ లేసు ట్రేడ్ సెంటర్ (ఐఎల్‌టీసీ)లో నిర్వహించిన వ్యవస్థాపకత అభివృద్ధి ముగింపు కార్యక్రమంలో జేసీ పాల్గొని మాట్లాడారు. రాబోయే కాలంలో అమెజాన్, ఫ్లిప్‌కార్డు మాదిరిగా ఓపెన్ నెట్‌వర్కు డిస్ట్రిబ్యూషన్, ఇ కామర్స్ ఒక పెద్ద ప్లాట్‌ఫామ్‌గా తీర్చిదిద్దబడుతుందన్నారు. వీటిపై మహిళలు అవగాహన పెంచుకుని స్వయం కృషితో అభివృద్ధి చెందాలన్నారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు జేసీ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఐఎల్‌టీసీ కన్వీనర్ కలవకొలను నాగ తులసీరావు, తహసీల్దార్ టి రాజరాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment