వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం
భీమవరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో పలు విభాగాల అధ్యక్షులను పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. విభాగాల వారీగా అధ్యక్షులు.. యూత్ విభాగానికి చిగురుపాటి సందీప్ (భీమవరం), మహిళా విభాగానికి కోడి విజయలక్ష్మి (భీమవరం), ఎస్టీసెల్ విభాగానికి బండి రమేష్ (పాలకొల్లు), కల్చరల్ విభాగానికి పి.వెంకటేశ్వరరావు (పాలకొల్లు), వైఎస్సార్ టీయూసీకి ఇంటి సత్యనారాయణ (భీమవరం), వాణిజ్య విభాగానికి రాజా బాల మస్తానయ్య (భీమవరం), క్రిస్టియన్ మైనార్టీ సెల్‌కి కుంచనపల్లి విన్స్‌టన్ బాబు (పాలకొల్లు), డాక్టర్స్ విభాగానికి పుల్లేటి విఠల్‌ప్రసాద్ (తాడేపల్లిగూడెం), ఇంటలెక్చువల్ ఫోరంనకు వంగలపూడి జక్కరయ్య (నరసాపురం), మున్సిపల్ విభాగానికి పేరిచర్ల సత్యనారాయణరాజు (భీమవరం), బూత్ కమిటీకి డీవీడీ ప్రసాద్ (భీమవరం), ఎంప్లాయీ, పెన్షనర్స్ విభాగానికి పెన్మెత్స రామరాజు (తణుకు).
ముద్రగడకు సంఘీభావం
కై కలూరు: వైఎస్సార్ సీపీ నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పార్టీ నాయకులు ఆయన నివాసంలో బుధవారం కలిసి తమ సంఘీభావం తెలిపారు. ముద్రగడ నివాసంపై ఇటీవల దాడి జరిగిన విషయం విదితమే. మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఎమ్మెల్సీ తోట త్రిముర్తులు, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు, ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్‌తో పాటు మండవల్లి ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్ కై కలూరు మండల పార్టీ అధ్యక్షుడు శింగంశెట్టి రాము, పంజా రామారావు, కన్నా రమేష్ ముద్రగడకు సంఘీభావం తెలిపినవారిలో ఉన్నారు.
ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కొలువులు
నూజివీడు: స్థానిక ట్రిపుల్ ఐటీలో పలు సంస్థలు నిర్వహించిన క్యాంపస్ సెలెక్షన్స్‌లో 46 మంది ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యార్థులు పలు ఉద్యోగాలకు ఎంపికై నట్లు నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. ఇన్ఫోసిస్ సంస్థ నిర్వహించిన సెలక్షన్స్‌లో 25 మంది హాజరుకాగా అందులో 22 మంది ఎంపికయ్యారు. వీరిలో 20 మంది సీఎస్‌ఈ విద్యార్థులు కాగా, ఈసీఈ విద్యార్థులు ఇద్దరు ఉన్నారు. ఎంపికై న 22 మంది బాలికలే కావడం గమనార్హం. అలాగే హెటెరో డ్రగ్స్‌కు కెమికల్ ఇంజినీరింగ్‌కు చెందిన 18 మంది విద్యార్థులు జూనియర్ ఇంజినీర్లుగా ఎంపికయ్యారు. వీరిలో 10 మంది బాలురు, 8 మంది బాలికలు ఉన్నారు. శ్రీకర కనస్ట్రక్షన్స్‌కు 6గురు సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థినులు ఎంపికయ్యారు. వీరిని డైరెక్టర్‌తో పాటు ఏఓ బీ లక్ష్మణరావు, డీన్ అకడమిక్ చిరంజీవి తదితరులు అభినందించారు.
ఆకట్టుకున్న జాతీయ సమైక్యతా ర్యాలీ
నరసాపురం: స్థానిక వైఎన్ కళాశాలలో జాతీయ సేవా పథకం, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో గత మూడురోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సమైక్యతా శిబిరం ఉత్సాహంగా సాగుతోంది. బుధవారం 12 రాష్ట్రాలకు చెందిన వలంటీర్లు తమ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ వేషధారణలతో పట్టణంలో నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. ఆర్డీవో దాసి రాజు ర్యాలీ ప్రారంభించి మాట్లాడారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది వలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్‌ఎస్‌ఎస్ లక్ష్యాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం మంచి విషయమన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ, ప్రిన్సిపాల్ సీహెచ్ కనకారావు, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment