గండ్ల గుదిబండ
నూజివీడు: పట్టణంలోని పెద్ద చెరువుకు పడిన గండ్లు ఎప్పుడు పూడుస్తారో? అని పట్టణ ప్రజలు, ఆయకట్టు రైతులు ఎదురు చూస్తున్నారు. గతేడాది ఆగస్టు నెల చివరి వారంలో భారీ వర్షాలు కురవడంతో ఆగస్టు 31న పెద్ద చెరువుకు నాలుగు చోట్ల గండ్లు పడి చెరువులోని నీళ్లన్నీ బయటకుపోయాయి. భారీ వర్షాలకు చెరువుకు ఎగువన ఉన్న సిద్ధార్ధనగర్ ప్రాంతాల్లోని కొండల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరి చెరువుకు నాలుగు చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో వరదనీరు ముంచెత్తడంతో రోడ్లు సైతం ధ్వంసమయ్యాయి. గండ్లు పడి ఐదు నెలలు గడిచినా ఇంత వరకు వాటిని పూడ్చలేదు. గండ్ల వద్ద కేవలం తాత్కాలిక రింగ్‌బండ్ మాత్రమే వేసి వదిలేశారు. దీంతో ఈ గండ్లు పూడ్చటానికి ఎంతకాలం పడుతుంది? అని పట్టణ ప్రజలు ప్రజలు ఈ చెరువు ఒక్కసారి నిండితే రెండేళ్ల పాటు సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్థానికులు పేర్కొంటున్నారు. ఒకవైపు సాగునీటిని అందించడంతో పాటు చెరువు నిండుగా ఉంటే పట్టణంలోని బావులు, బోర్లలో నీటి మట్టం పడిపోదని చెబుతున్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన చెరువు గండ్లను పూడ్చడానికి నెలల తరబడి జాప్యం చేయడంపై ఆయకట్టు రైతులు, పట్టణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
రింగ్‌బండ్‌లకు మాత్రమే పరిమితం
పెద్దచెరువుకు కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఒక గండి, పెట్రోలు బంకు, పాత గ్యాస్ గోడౌన్‌ల వద్ద మరో మూడు గండ్లు పడ్డాయి. ఈ గండ్లకు తాత్కాలికంగా రింగ్‌బండ్‌లను మాత్రమే వేసి ఉంచారు. అలాగే చెరువుకు చెందిన పెద్ద తూము, చిన్న తూము లు దెబ్బతిన్నాయి. వీటికి కూడా మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు. యనమదల వద్ద ఉన్న ఎత్తిపోతల పథకం ద్వారా సాగర్‌జలాలతో పెద్ద చెరువును నింపుకోవచ్చు. 200 ఎకరాల విస్తీర్ణం ఉన్న పెద్ద చెరువు కింద దాదాపు 350 ఎకరాల ఆయకట్టు ఉండగా, అందులో కొంత భాగం ప్రజలు ఇళ్లు నిర్మించుకోవడంతో పంటలు పండే ఆయకట్టు తగ్గింది. చెరువులో దక్షిణ, పడమర భాగాల్లో చాలా భాగం ఆక్రమణకు గురైంది. ఈ ఆక్రమణలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వచ్చే వర్షాకాలం నాటికై నా చెరువు గండ్లను పూడ్పించి చెరువును సిద్ధంగా ఉంచాలని కోరుతున్నారు.
పట్టణంలో ప్రమాదకరంగా పెద్ద చెరువు
గండ్లు పడి ఐదు నెలల పూర్తయినా పట్టించుకోని వైనం
Comments
Please login to add a commentAdd a comment