సాగు చేపట్టేదెలా? | - | Sakshi
Sakshi News home page

సాగు చేపట్టేదెలా?

Published Thu, Feb 6 2025 2:09 AM | Last Updated on Thu, Feb 6 2025 2:09 AM

సాగు

సాగు చేపట్టేదెలా?

రేషన్‌ బియ్యం సీజ్‌
నూజివీడు మండలంలోని మిట్టగూడెం వద్ద మంగళవారం అర్ధరాత్రి మినీ వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 3.5 టన్నుల రేషన్‌ బియ్యాన్ని అధికారులు సీజ్‌ చేశారు. 8లో u

గురువారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

భీమవరం అర్బన్‌: ఆక్వా హబ్‌గా పేరుగాంచిన జిల్లాలో గత నెలరోజులుగా మార్కెట్‌లో చేప ధరలు పడిపోవడంతో రైతులు కుదేలవుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా ప్రభావం కారణంగా చేప ఎగుమతులు మందగించాయి. దీంతో చేపలకు సరైన ధరలు పలకక రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. భీమవరం, నరసాపురం, మొగల్తూరు, ఉండి, కాళ్ల, ఆకివీడు, వీరవాసరం యలమంచిలి, పాలకొల్లు, పాలకోడేరు, అత్తిలి, పెనుమంట్ర, ఆచంట తదితర మండలాల్లో సుమారు లక్షా 20 వేల ఎకరాల్లో ఆక్వా చేపలు, రొయ్యలు పెంపకం సాగిస్తున్నారు. ప్రధానంగా శీలావతి, కట్ల పెంపకం సాగిస్తుండగా రూప్‌ చంద్‌, ఫంగస్‌, గడ్డి చేప, మోస్‌ తదితర సప్పనీటి చేపలను పెంచుతున్నారు. ముఖ్యంగా జిల్లా నుంచి ఉత్తరాది రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సా, రాజస్థాన్‌, హర్యానా తదితర రాష్ట్రాలకు చేపలు ఎగుమతులు అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సరాసరి సుమారు 2 వేల నుంచి 2,500 టన్నులు ఎగుమతులు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.7,500 కోట్లు విదేశీ మారక ద్రవ్యం చేకూరుతుంది.

కుంభమేళాతో మందగించిన చేప ఎగుమతులు

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా ప్రభావం జిల్లాలో చేప ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. రోజుకు సుమారు 1500 టన్నులు చేప ఎగుమతులు వెళ్లడం కష్టంగా మారిందని మత్స్యశాఖాధికారులు, రైతు విశ్లేషకులు చెబుతున్నారు. జనవరి 13 నుంచి 45 రోజుల పాటు నార్త్‌, ఈస్ట్రన్‌ రాష్ట్రాలు చేపలు తినకపోవడంతో చేప ఎగుమతులు మందగించాయని చెబుతున్నారు.

ఆందోళనలో చేప రైతులు

సాధారణంగా చేప రైతులు ఫిబ్రవరి నుంచి పట్టుబడికి వచ్చిన చేపలు మార్కెట్‌కు తరలించి తమ చెరువుల్లో పిల్ల చేపలు వేసుకోవడం వల్ల వేసవికాలంలో ఎండ తీవ్రత నుంచి చేపలను రక్షించుకునేవారు. ఈ ఏడాది కుంభమేళా ప్రభావంతో చేపలు ఎగుమతులు నిలిచిపోవడంతో తమ చెరువుల్లోని చేపలను పట్టలేక చేప పిల్లలు వేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు నష్టం సాగులో వాటిల్లుతుందని రైతులు చెబుతున్నారు.

భారీగా తగ్గిన చేప ధర : కుంభమేళాకు ముందు కిలో శీలావతి ధర రూ.125, కట్ల రూ.140, రూప్‌ చంద్‌ రూ. 135, గడ్డి చేప రూ.120, ఫంగస్‌ రూ.90 ఉన్నాయి. అంతేకాకుండా టన్నేజి ఆధారంగా కేజీకి రూ.5 నుంచి 10 వరకు పెంచి వ్యాపారస్తులు గతంలో కొనేవారు. ప్రస్తుతం శీలావతి కిలో రూ.105, కట్ల రూ.130, రూప్‌చంద్‌ రూ.120, గడ్డి చేప 100, ఫంగస్‌ రూ. 80 ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేజీ లోపు వచ్చిన చేపలు కొన్న వ్యాపారస్తులు రావడం లేదని చేప రైతులు చెబుతున్నారు.

భారీ స్థాయిలో పెరిగిన చెరువు కౌలు

ఎకరం లీజు ఏడాదికి ప్రాంతాన్ని బట్టీ రూ.60 వేలు నుంచి రూ.లక్షా 20 వేలు వరకు ఉన్నాయి. చేపలు 6 నుంచి 8 నెలల్లో పట్టుబడికి వస్తాయి. మేతఖర్చులు, కూలీలు ధరలు పెరిగిపోవడంతో ఇప్పటికే నష్టాలు వస్తున్నాయని చేపలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుంభమేళా ప్రభావంతో ఈ ఏడాది సాగులో తీవ్ర నష్టాలు తప్పవని రైతులు గుబులు చెందుతున్నారు.

న్యూస్‌రీల్‌

చేప రైతు కుదేలు

మార్కెట్‌లో పడిపోయిన శీలావతి చేప ధర

రానున్న వేసవిలో చేపకు గడ్డుకాలమేనంటున్న రైతులు

జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో చేపల పెంపకం

తీవ్రంగా నష్టపోయాం

వచ్చేది వేసవి కావడంతో రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి. ఏప్రిల్‌ నుంచి కాలువలు కట్టేస్తారు. ఇప్పుడు చెరువులో చేపలను పట్టుబడులు పట్టి చిన్న చేపలు వేసుకుంటే వేసవి తాపం నుంచి గట్టెక్కుతాం. కుంభమేళా కారణంగా చేపలను అడిగే వ్యాపారస్తులు రావడం లేదు. ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయాం

– పెనుమాల నరసింహస్వామి, చేప రైతు, గొల్లవానితిప్ప

కుంభమేళా ప్రభావం

జిల్లా నుంచి నార్త్‌, ఈస్ట్రన్‌ రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సా, రాజస్థాన్‌, హర్యానా తదితర రాష్ట్రాలకు చేపలు ఎగుమతులు జరుగుతున్నాయి. కుంభమేళా 45 రోజులు ఆ రాష్ట్రాల్లో మాంసాహారం భుజించరు. దీంతో ఎగుమతులు తగ్గి చేప ధరపై పడింది. ఈ నెల మూడో వారం నుంచి చేప ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

– ఎల్‌ఎల్‌ఎన్‌ రాజు, మత్స్యశాఖ ఇన్‌చార్జి ఏడీ, భీమవరం

No comments yet. Be the first to comment!
Add a comment
సాగు చేపట్టేదెలా?1
1/3

సాగు చేపట్టేదెలా?

సాగు చేపట్టేదెలా?2
2/3

సాగు చేపట్టేదెలా?

సాగు చేపట్టేదెలా?3
3/3

సాగు చేపట్టేదెలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement