సాగర్‌లో మరిన్ని హంగులు
ఫ స్వదేశీ దర్శన్ స్కీం కింద
నిధులు మంజూరు చేయాలని
కేంద్రానికి ప్రతిపాదనలు
ఫ బుద్ధవనంలో డిజిటల్ మ్యూజియం,
బౌద్ధ విశ్వవిద్యాలయం..
ఫ చాకలికొండలో, వైజాగ్ కాలనీ వద్ద
కాటేజీల ఏర్పాటుకు సన్నాహాలు
ఫ స్టార్ హోటల్స్‌తో పాటు వాటర్ గేమ్స్, స్పీడ్ బోట్లు నడిపించాలని నిర్ణయం
నాగార్జునసాగర్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, బౌద్ధం పరిఢవిల్లిన నాగార్జునసాగర్‌ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. రూ.100కోట్లతో నాగార్జున సాగర్‌తో పాటు పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సాగర్‌లో అనువైన చోట స్టార్ హోటల్స్, కాటేజీలు, జలాశయంలో వాటర్ గేమ్స్, స్పీడ్ బోట్స్ నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది.
చాకలికొండపై కాటేజీలు
విదేశీ పర్యాటకులు ప్రశాంతంగా గడిపేందుకు సాగర్ జలాశయం మధ్యలో 500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న చాకలికొండలో కొంతభాగాన్ని తీసుకుని అటవీశాఖతో కలిసి ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏకో టూరిజం అభివృద్ధి చేసేందుకు అంచనాలు సిద్ధమయ్యాయి. ఇక్కడ కాటేజీలు నిర్మించనున్నారు. ఇందుకు గాను మూడు కన్సల్టెన్సీ ఏజెన్సీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాటేజీల ఏర్పాటుకు అవసరమయ్యే నిధుల అంచనాలను ఏజెన్సీలు తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాయి. ఈ డీపీఆర్‌ల ఆధారంగా స్వదేశీ దర్శన్ 2.0 నిధులు మంజూరు చేయాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.
Comments
Please login to add a commentAdd a comment