దేవరకొండ: పట్టపగలు రెండిళ్లలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన దేవరకొండ పట్టణంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ పట్టణంలోని జైపాల్‌రెడ్డి కాలనీలో నివాసముంటున్న రమావత్ రాజు భార్య హైదరాబాద్‌కు వెళ్లగా.. రాజు రోజువారి పని మీద బయటకు వెళ్లాడు. ఇంటి వద్ద ఉన్న రాజు తల్లి దేవలి మధ్యాహ్నం పిల్లలకు లంచ్ బాక్స్ ఇచ్చేందుకు ఇంటికి తాళం వేసి పాఠశాలకు వెళ్లింది. దారిలో కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గమనించిన కుమారుడికి సమాచారం ఇచ్చింది. ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.1.57లక్షల నగదు, తులంన్నర బంగారం చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. అదేవిధంగా దేవరకొండ పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో నివాసముంటున్న నేనావత్ శ్రీను, అతడి భార్య పని నిమిత్తం మంగళవారం హైదరాబాద్‌కు వెళ్లారు. వారి కుమారుడు సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఇంట్లోని బీరువాలో ఉంచిన రూ.50వేల నగదుతో పాటు బంగారం చోరీ అయినట్లు బాధితుడు తెలిపాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ నర్సింహులు తెలిపారు.
ఫ రూ.2లక్షల నగదు, తులంన్నర
బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు
Comments
Please login to add a commentAdd a comment