సీసీఐ కేంద్రానికి పోటెత్తిన ‘తెల్ల బంగారం’
సీసీఐ కేంద్రంతో రైతులకు మేలు
మండలంలో సీసీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జరిగింది. మద్దతు ధర లభించడంతో రైతులకు ఏలాంటి నష్టం జరుగలేదు. చిన్నచిన్న సమస్యలే తప్ప కేంద్రంలో పత్తి కొనుగోలుకు అవాంతరాలు ఎదురుకాలేదు.
– కాసర్ల విద్యాసాగర్‌రెడ్డి, రైతు, పెర్కకొండారం
పడిగాపులు కాస్తున్నాం
ఐదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగుచేశా. పత్తి అమ్ముకునేందుకు సీసీఐ కేంద్రానికి వస్తే ట్రాక్టర్లు అధికంగా ఉండటంతో క్యూలైన్‌లో మా ట్రాక్టర్ నిలిపాం. రెండు రోజులుగా రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నాం.
– బొడ్డు సైదమ్మ, కౌలురైతు, ఊట్కూరు
శాలిగౌరారం: మండలంలోని మాధారంకలాన్‌లో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రానికి పత్తి (తెల్లబంగారం) పోటెత్తుతోంది. సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఈ నెల 6న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రారంభించారు. తొలుత తేమశాతం ఎక్కువగా నమోదు కావడంతో కొనుగోలు మందకొడిగా జరిగింది. ప్రస్తుతం నిర్ణీతస్థాయిలో తేమశాతం నమోదు కావడంతో సంబంధిత అధికారులు పత్తికొనుగోలును వేగవంతం చేశారు. పత్తికి ప్రభుత్వం రూ.7,520 మద్దతు ధర కల్పిస్తుండడంతో శాలిగౌరారం మండలంతోపాటు నకిరేకల్, అర్వపల్లి తదితర మండలాలకు చెందిన రైతులు సైతం వాహనాల్లో భారీగా పత్తిని తీసుకువస్తున్నారు. దీంతో మంగళవారం 365వ నంబర్ జాతీయ రహదారిపై సుమారు కిలోమీటరు మేర పత్తి లోడుతో వచ్చిన వాహనాలు నిలిచిపోయాయి.
844 మంది రైతుల నుంచి 22,709 క్వింటాళ్లు
మండలంలోని మాదారంకలాన్ సీసీఐ కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటివరకు 844 మంది రైతుల నుంచి 22,709 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. 300 మంది రైతులకు రూ.5 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశారు.
శాలిగౌరారంలో 23వేల ఎకరాల్లో సాగు
మండల పరిధిలో 23 వేల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగుచేశారు. వర్షాలు సకాలంలో కురువడంతో ఈసారి పత్తిసాగు ఆశాజనకంగా మారింది. వ్యవసాయ అధికారులు మండలంలో 2లక్షల క్వింటాళ్లకు పైగా పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రం ఆలస్యంగా ప్రారంభంకావడంతో రైతులు దళారులకు అమ్ముకున్నారు.
ఫ కిలోమీటరు మేర నిలిచిన
పత్తి ట్రాక్టర్లు
ఫ కొనుగోళ్లు వేగవంతం చేసిన
అధికారులు
ఫ ఇప్పటి వరకు 22,709
క్వింటాళ్లు కొనుగోలు
Comments
Please login to add a commentAdd a comment