లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

Published Wed, Nov 27 2024 7:05 AM | Last Updated on Wed, Nov 27 2024 7:05 AM

లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

భానుపురి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు పేర్ల నాగయ్య, జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ హుస్సేన్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం సూర్యాపేట పట్టణంలోని శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రజలపై విపరీతమైన భారం మోపిందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్‌ జిల్లా కమిటీ సభ్యుడు కారింగుల వెంకన్న, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్‌కుమార్‌, నాయకులు గొడ్డలి నరసన్న, చంద్రకళ, సంతోషిమాత, సూరం రేణుక, జయమ్మ, ఉపేందర్‌, జానయ్య, సాయబుస్సేన్‌, పద్మ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement