149 మంది వీఆర్‌ఏల సర్దుబాటు ఎప్పుడు?
ఆత్మకూరు(ఎం): జిల్లాలో కొందరు వీఆర్‌ఏలు పదోన్నతి పొందగా.. మరికొందరు పదోన్నతికి నోచుకోలేదు. జిల్లాలో 649 మంది వీఆర్‌ఏలు ఉండగా.. వీరిలో 500 మందికి గత సంవత్సరం జూలైలో రికార్డు అసిస్టెంట్‌లుగా, జూనియర్ అసిస్టెంట్‌లుగా అర్హతను బట్టి పదోన్నతి కల్పించారు. ప్రస్తుతం వారు తహసీల్దార్ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 149 మంది ఎమ్మెల్సీ ఓట్ల పక్రియ, కార్యాలయ ఆవరణలు శుభ్ర చేయడం, అటెండర్ తరహా పనులు చేయాల్సి వస్తోంది.
ప్రధాన కారణమేమిటంటే..
జిల్లా వ్యాప్తంగా ఉన్న 649 వీఆర్‌ఏలను జూనియర్ అసిస్టెంట్‌లుగా, రికార్డు అసిస్టెంట్‌లుగా పదోన్నతులు కల్పించాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే జీఓ వచ్చే నాటికి తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అటెండర్‌లు తమకు కూడా పదోన్నతులు కల్పించాలని కోర్టుకు వెళ్లడంతో పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది. అప్పటికే పదోన్నతులు పొందిన కొందరు వీఆర్‌ఏలకు మాత్రం ఆర్డర్ కాపీలను అందజేయడంతో ప్రస్తుతం వారు పేస్కేల్ పొందుతున్నారు. పదోన్నతి పొందని వారు తమను కూడా తహసీల్దార్ కార్యాలయాల్లో రికార్డు అసిస్టెంట్‌లుగా, జూనియర్ అసిస్టెంట్‌లుగా నియమించాలని కోరుతున్నారు.
పదోన్నతి లభించలేదు
గత 5 సంవత్సరాల నుంచి వారసత్వ నియామకంతో పోతిరెడ్డిపల్లి వీఆర్‌ఏగా పని చేస్తున్నాను. సీసీఎల్‌కు పంపిన పదోన్నతి జాబితాలో నా పేరు కూడా ఉంది. అయినా పదోన్నతి లభించలేదు.
– శ్రీశైలం, వీఆర్‌ఏ, పోతిరెడ్డిపల్లి
న్యాయం చేయాలి
తమతో వీఆర్‌ఏలుగా విధులు నిర్వహించిన వారు జూనియర్ అసిస్టెంట్‌లుగా, రికార్డు అసిస్టెంట్‌లుగా విధులు నిర్వహిస్తున్నారు. మా వరకు వచ్చే సరికి పదోన్నతులు ఆపేశారు. మాకు న్యాయం చేయాలి. – రమేష్, వీఆర్‌ఏ, సింగారం
ఫ జిల్లాలో కొందరు వీఆర్‌ఏలకే పదోన్నతి
ఫ మిగిలిన వారికి తప్పని వెట్టిచాకిరీ
ఫ పనిభారంతో సతమతం
Comments
Please login to add a commentAdd a comment