భువనగిరిటౌన్: ప్రధాని మోదీకి పరిపాలించే హక్కు లేదని అఖిల భారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య అన్నారు. మోదీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా మంగళవారం జిల్లా కేంద్రంలో జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) జాతీయ కమిటీలు ఇచ్చిన పిలుపు మేరకు భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌరస్తా వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా రైతు చట్టాలను రద్దు చేస్తానని చెప్పిన మోదీ నేటికీ వాటిని రద్దు చేయలేదని విమర్శించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నూతన లేబర్ కోడ్‌లను తీసుకువచ్చారని, ఫలితంగా కార్మికులకు 12 గంటల పని పెరిగే ప్రమాదం ఉందన్నారు. సమావేశంలో నాయకులు ఢిల్లీ మాధవ రెడ్డి, ఏశాల అశోక్, గోరేటి రాములు, గడ్డం నాగరాజు, మంగ నర్సింహులు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గొరిగె సోములు, మాయ కృష్ణ, బోడ భాగ్య, గడ్డం ఈశ్వర్, ముత్యాలు పాల్గొన్నారు.
ఫ అఖిల భారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య
Comments
Please login to add a commentAdd a comment