ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
సాక్షి,యాదాద్రి: ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 30న నిర్వహించే రైతుల పండుగను విజయవంతం చేయాలని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్, రైతుల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాల గురించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, గంగాధర్ పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలి
భువనగిరి: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో నాణ్యత ప్రమాణాలను పాటించడంతో పాటు, రుచి, శుభ్రత చూసుకోవాలన్నారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా విద్యనందించాలన్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అంతకు ముందు పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు రేణుక, ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, ఉపాధ్యాయులు మూర్తి, శ్రీవాణి, రామలింగయ్య తదితరులున్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
కలెక్టరేట్‌లో రాజ్యాంగ దినోత్సవం
భువనగిరిటౌన్: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ హనుమంతరావు జిల్లా అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఏఓ జగన్మోహన్ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment