ముమ్మరంగా డేటా ఆన్‌లైన్ ప్రక్రియ
భువనగిరిటౌన్: జిల్లాలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 30 శాతం డేటా ఎంట్రీ పూర్తయింది. ఇందుకుగాను మండలాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించారు. మున్సిపాలిటీ కార్యాలయాలు, మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సైతం సమగ్ర సర్వే వివరాల ఆన్‌లైన్ నమోదు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రామన్నపేట మండలంలో 40 శాతం కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. కాగా.. రెండు, మూడు రోజుల్లో మిగిలిన కుటుంబాలను సర్వే చేయనున్నారు. వీటితో వంద శాతం పూర్తికానున్నట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో 1300 మంది ఆపరేటర్లు
జిల్లా వ్యాప్తంగా 1300 మంది కంప్యూటర్ ఆపరేటర్లు సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఒక్కో మండలానికి 20 మంది చొప్పున కంప్యూటర్ ఆపరేటర్లు డేటా ఎంట్రీ చేస్తున్నారు. భువనగిరి మున్సిపాలిటీలో 35 మంది ఆపరేటర్ల ఉన్నారు. ఒక్కో ఆపరేటర్ రోజుకు 25 కుటుంబాల వివరాలు ఆన్‌లైన్ చేస్తున్నారు.
జిల్లా అధికారుల పర్యవేక్షణ
జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రతి మండలంలో జరుగుతున్న డేటా ఎంట్రీని పరిశీలిస్తున్నారు. ఆయా మండలాలకు కేటాయించిన నోడల్ అధికారులు ప్రతి రోజు డేటా ఎంట్రీని పరిశీలించాలని ఆదేశించడంతో వారు దగ్గర ఉండి నమోదు చేయిస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని మండలాల్లో 2,15,011 ఇళ్లను సర్వే చేయగా.. 6 మున్సిపాలిటీల్లో 45,548 ఇళ్ల సర్వే పూర్తిగా చేశారు. మొత్తంగా 2,60,559 ఇళ్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.
ఫ 1300 కంప్యూటర్ ఆపరేటర్లతో
డేటా ఎంట్రీ
ఫ పర్యవేక్షిస్తున్న ఎన్యుమరేటర్లు
Comments
Please login to add a commentAdd a comment