యాదగిరిగుట్ట: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కేటీఆర్‌కు మైండ్ పని చేయడం లేదని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం యాదగిరిగుట్టలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌కు అధికారం పోయిందనే ఆవేదనతో మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్లు ఇస్తే.. తిరిగి వెనక్కి పంపిస్తే సీఎం రేవంత్‌రెడ్డిని బదనాం చేసేందుకు కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆదానీతో కేటీఆర్ చీకటి ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా పాలన సాగిస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డిపై మరోసారి పిచ్చి మాటలు మాట్లాడితే కేటీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
నగదు రహిత సౌకర్యం కల్పించాలి
భానుపురి (సూర్యాపేట) : పెన్షనర్లకు నగదు రహిత వైద్య సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు సీతారామయ్య ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్‌సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి.రాంబాబు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
Comments
Please login to add a commentAdd a comment