మెనూ ప్రకారం భోజనం అందించాలి
వలిగొండ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. మంగళవారం వలిగొండ మండలంలోని టేకులసోమారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. నిర్వాహకులు నాణ్యమైన భోజనాలు సరఫరా చేస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన కూరగాయలు, వంట సరుకులతో విద్యార్థులకు భోజనాలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. రెడ్లరేపాక పరిధిలోని మనిగండ్లగుట్ట ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సమీకృత పాఠశాల స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్‌ఐ మనోహర్ ఉన్నారు.
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
భువనగిరి: డిసెంబర్ 4న నిర్వహించే నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ సత్యనారాయణ అన్నారు. ఎన్‌ఏఎస్ పరీక్ష నిర్వహణకు ఎంపిక చేసిన ఇన్విజిలేటర్స్‌కు మంగళవారం భువనగిరిలోని వెన్నెల కళాశాలలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ప్రభుత్వ విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ పాండు, క్వాలిటీ కో ఆర్డినేటర్ శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్స్ జానీ, నర్సింహాచారి పాల్గొన్నారు.
సమాజంపై అవగాహన ఉండాలి
యాదగిరిగుట్ట: విద్యార్థులకు చదువుతో పాటు సమాజంపై అవగాహన ఉండాలని జిల్లా యువజన, క్రీడల అధికారి ధనుంజనేయులు అన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కేంద్రంలో నవభారత్ యూత్ అసోసియేషన్, నెహ్రూ యువ కేంద్రం సంయుక్తంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అంతకు ముందు ట్రైనింగ్ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. విద్యార్థులకు సమాజ అవగాహనపై పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం ట్రైనింగ్ సెంటర్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నవభారత్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సరగడ కరణ్, వలంటీర్ అంబేద్కర్, అసిస్టెంట్ మేనేజర్ జానకి రాములు, మురళి, ట్రైనింగ్ ఫ్యాకల్టీ భువనగిరి రేణుక, కై సర్, రాజశేఖర్, శ్రీనివాస్ తదితరులున్నారు.
వచ్చే నెల 10 వరకు హింసా నివారణ పక్షోత్సవాలు
భువనగిరిటౌన్: మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సార్ప్ సంస్థ అధ్యక్షురాలు ప్రమీల అన్నారు. సీ్త్రలపై హింసా నివారణ పక్షోత్సవాలు డిసెంబర్ 10 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని వినాయక చౌరస్తా వద్ద విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్యక్రమంలో చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, సుదర్శన్, జహంగీర్, రామచంద్రయ్య, యాత్ర శివలింగం, సైదులు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment