నార్కట్‌పల్లి : నల్లగొండ జిల్లా చెర్వుగట్టులో కొలువైన శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలోని గట్టుపైన భక్తులు సమర్పించే తలనీలాల సేకరణకు బుధవారం హైదరాబాద్‌లో వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో రాష్ట్ర నలుమూలలకు చెందిన కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కోలకలూరు చెందిన వ్యక్తి రూ.1,39,00,000 వేలం దక్కించుకున్నారు. సదరు వ్యక్తి ఏడాది పాటు దేవాలయం ఆవరణలో తలనీలాల సేకరించుకునే హక్కు కలిగి ఉంటారని దేవాలయ ఈఓ నవీన్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ సురకంటి ఇంద్రసేనారెడ్డి తెలిపారు. దేవాలయ నిబంధనల ప్రకారం డబ్బు చెల్లించని పక్షంలో టెండర్ రద్దు చేస్తారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment