కేటీఆర్‌పై కేసు కుట్రపూరితం
ఆలేరురూరల్ : కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, కేటీఆర్‌పై ఫార్ములా ఈ–కార్ రేసు విషయంలో కేసు నమోదు చేయడం కుట్రపూరితమని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆలేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న కేటీఆర్‌పై.. కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టిందని, ఫార్ములా ఈ–కారు రేస్‌లో అక్రమాలు జరగకున్నా ఉద్దేశపూర్వకంగానే కేసులు బనాయించిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అక్రమ కేసులు, అరెస్టులతో డైవర్సన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నాడని, ఇవి ఎంతోకాలం సాగవన్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గత పదేళ్లుగా వివిథ దేశాల్లో స్టీట్ సర్క్యూట్‌లలో ఫార్ములా వన్ కార్ల రేసులను నిర్వహిస్తున్న విషయాన్ని రేవంత్‌రెడ్డి గ్రహించాలన్నారు. ఫార్ములా ఈ–కార్ రేసు వ్యవహారంలో అవినీతి చోటు చేసుకున్నట్లు ఆధారాలు ఉంటే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తీరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బంతింటుందని, పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు, మోసాలను ప్రజల ఎదుట పెడుతామని, కేటీఆర్‌ను అరెస్టు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ శంకరయ్య, నాయకులు పుట్ట మల్లేషం, జెల్లి నర్సింహులు, పంతం కృష్ణ, పత్తి వెంకటేష్, కుండె సంపత్, దయ్యాల సంపత్, ఎండీ ఫయాజ్, ఎండీ గోరమియా, అజయ్, టింకు, రాజు, బాలరాజు, ప్రశాంత్, ప్రార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
ఫ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment