22న ఉమ్మడి నల్లగొండ ఖోఖో జట్ల ఎంపిక పోటీలు
భువనగిరి : ఉమ్మడి నల్లగొండ జిల్లా ఖోఖో జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 22న దామచర్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసక్తి కలిగిన క్రీడాకారులు ఆధార్ కార్డు ఒరిజినల్, జికార్స్ కాపీలతో దయం 9 గంటలకు పాఠశాలలో ఖోఖో కోచ్ నాగేశ్వర్‌రావుకు అందజేయాలన్నారు. ఎంపికై న క్రీడాకారులు జనవరి 8, 9, 10, 11 తేదీల్లో వరంగల్ జిల్లా గీసుకొండలో జరగనున్న 57వ సీనియర్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో ఆడనున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్లు 98663 68843, 63000 85314, 99127 54498ను సంప్రదించాలని కోరారు.
నేడు న్యాయ విద్యార్థుల రాష్ట్ర సదస్సు
భువనగిరి టౌన్ : హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం న్యాయ విద్యార్థుల రాష్ట్ర సదస్సు ఉంటుందని, న్యాయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు)రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్‌రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సదస్సులో ‘పౌర సమాజం – రాజ్యాంగం’ అనే అంశంపై చర్చాగోష్టి ఉంటుందన్నారు. ఈ సదస్సుకు ఐలు ఆలిండియా కార్యదర్శి, సుప్రీంకోర్టు న్యాయవాది సురేంద్రనాథ్, నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ విశ్రాంత ప్రొఫెసర్ మోహన్‌గోపాల్ తదితరులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఐలు జిల్లా ఉపాధ్యక్షులు కుక్కదువ సోమయ్య, పాల్వంచ జరుగుతయ్య, తడ్క మోహన్, సహాయ కార్యదర్శి శ్రీనివాస్, బొల్లేపెల్లి కుమార్, చింతల రాజశేఖర్‌రెడ్డి, బొడ్డు కిషన్, ఎండీ నిహాల్ తదితరులు పాల్గొన్నారు.
టీఎస్‌జీవీబీగా ఏపీజీవీబీ
మోత్కూరు, రాజాపేట : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) ఇకనుంచి తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకు(టీఎస్‌జీవీబీ)గా మారనున్నట్లు మోత్కూరు, రాజాపేట ఏపీజీవీబీల మేనేజర్లు సీహెచ్ గీత, తిరుమలశెట్టి నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో వారు మాట్లాడారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో ఉన్న గ్రామీణ బ్యాంకులు సంబంధిత రాష్ట్రం పేరుతో సేవలందించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయించినట్లు వెల్లడించారు. జనవరి 1నుంచి తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకు పేరుతో సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ మార్పు కారణంగా ఈ నెల 28, 29, 30, 31 తేదీల్లో నాలుగు రోజుల పాటు ఖాతాదారులకు అన్నిరకాల బ్యాంకింగ్, ఆన్‌లైన్ సేవలు నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. సరికొత్త మార్పులతో అందించే సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకొని గతంలో మాదిరిగానే బ్యాంకును ఆదరించాలని మేనేజర్లు కోరారు.
బస్సును పునరుద్ధరించాలి
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్–వలిగొండ షటిల్ బస్సును పునరుద్ధరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం స్టేజీ వద్ద శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె శివకుమార్, మండల ఉపాధ్యక్షుడు తీగుళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా నడుస్తున్న బస్సును రద్దు చేయడం వల్ల విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. బస్సులను సమయానికి అనుగుణంగా నడపకుండా అధికారులు కేవలం ధనార్జనే ధ్యేయంగా భావించడం తగదన్నారు. షటిల్ బస్సును పునరుద్ధరించడంతో పాటు జిల్లాలోని అన్ని రూట్లలో బస్సులు నడపాలని కోరారు. రాస్తారోకోకు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బూర్గు కృష్ణారెడ్డి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రుద్రగోని మధు,జంగిలి సాయినాధ్, లింగస్వామి, వంశీ, మల్లేష్, డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు బోదాసు నరేష్, సీపీఎం నాయకుడు కొండె శ్రీశైలం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment