కొనసాగుతున్న సీఎం కప్ క్రీడా పోటీలు
భువనగిరి : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మైదానం, ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు శుక్రవారం కొనసాగాయి. ఇందులో భాగంగా కిక్ బాక్సింగ్, కరాటే, షటిల్ బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, జూడో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజయనేయులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణమూర్తి, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గోపాల్, సుజాత, కేశనాగులు, కోటేశ్వర్, సందీప్, శ్రీనివాస్, పర్వేజ్, పీడీలు, పీఈటీ పాల్గొన్నారు.
నేటితో ముగియనున్న క్రీడలు
ఈ నెల 16న ప్రారంభమైన సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు శనివారంతో ముగియనున్నాయి. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి ఈ నెల 21న ఫైనల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన జట్లు, వ్యక్తిగత విభాగాల్లోని క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment