ధర తగ్గిస్తూ.. దగా చేస్తూ..
భువనగిరి : సిండికేట్‌గా ఏర్పడిన వ్యాపారులు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రారంభంలో క్వింటా రూ.11,700 వరకు కొనుగోలు చేయగా.. ప్రస్తుతం ఏకంగా రూ.2వేలు తగ్గించారు. మొదట్లో అధిక ధరతో అనందపడ్డ రైతులు.. ప్రస్తుత రేటుతో నిరాశలో ఉన్నారు.
పెరిగిన సాగు విస్తీర్ణం
గత సీజన్‌తో పోలిస్తే ఈసారి జిల్లాలో వెయ్యి ఎకరాలకు పైగా కంది సాగు విస్తీర్ణం పెరిగింది. గత ఏడాది 8,542 ఎకరాల్లో సాగు చేయగా.. ఈ సారి 9,846 ఎకరాల్లో వేశారు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో అంచనాలకు మించి దిగుబడి వచ్చింది. కానీ, ధర తగ్గించి కొనుగోలు చేస్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఆనందం ఆవిరి
కందులకు ప్రభుత్వం క్వింటాకు రూ.7,550 మద్దతు ధర ప్రకటించింది. ప్రారంభంలో మద్దతు ధరకు మించి క్వింటా రూ.11,700 పలికాయి. ధర ఎక్కువగా పలకడంతో రైతులు సంతోషపడ్డారు. కానీ, వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధర తగ్గించారు. రెండు, మూడు రోజులుగా క్వింటా రూ.10 వేల లోపే మాత్రమే కొనుగోలుచేస్తున్నారు.
వ్యాపారుల సిండికేట్
ఫ తక్కువ రేటుకు కందుల కొనుగోలు
ఫ ఏకంగా రూ.2 వేలు తగ్గింపు
ఫ ఆందోళన చెందుతున్న రైతులు
Comments
Please login to add a commentAdd a comment