ఇళ్ల సర్వే వేగవంతం చేయండి
రాజాపేట : ఇందిరమ్మ ఇళ్ల సర్వే వేగవంతం చేసి సకాలంలోని పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. రాజాపేటలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను బుధవారం ఆయన తనిఖీ చేశారు. మొబైల్ యాప్‌లో నమోదు చేసిన దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తుదారుల వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేయాలన్నారు. పొరపాట్లకు తావుండవద్దన్నారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రికార్డులను పరిశీలించారు.భూ సమస్యలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దామోదర్, ఎంపీడీఓ నాగవేణి, ఎంపీఓ ఆవుల కిషన్, రెవెన్యూ ఆర్‌ఐ రమేష్, నరసింహులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ వీరారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment