మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
భునగిరిటౌన్ : మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ట్రైనర్లు కృషి జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారా సూచించారు. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు ఎంపిక చేసిన మాస్టర్ ట్రైనర్లకు న్యూ హోఫ్ అసోసియేషన్ ఎన్జీఓ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ట్రైనర్లకు సూచించారు. ఇందులో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లోని యువత, మహిళలు ఇలా.. అన్నివర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment