మున్సిపాలిటీలు మాకొద్దు!
సాక్షి, యాదాద్రి: కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో విలీనం చేసిన గ్రామాలను తిరిగి పంచాయతీలుగా మార్చాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆశించిన మేర అభివృద్ధి జరగకపోవడం, మున్సిపాలిటీల్లో ఉపాధి హామీ రద్దవడం, ఇంటి అనుమతులకు ఇబ్బందులు, పెరిగిన ఇంటి పన్నులు, హెచ్‌ఎండీఏ మున్సిపాలిటీల్లో ప్రతి పనికి హెచ్‌ఎండీఏకు లింక్ పెట్టడం వంటి వాటితో సమస్యలు ఎదురవుతున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు.
నూతన మున్సిపాలిటీలు ఇలా..
జిల్లాలో భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూర్, పోచంపల్లి, చౌటుప్పల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. అప్పట్లో ప్రభుత్వం 15వేల నుంచి 20 వేల జనాభా కలిగిన గ్రామపంచాయతీలను మున్సి పాలిటీలుగా చేశారు. సరిపోను జనాభా లేని చోట మూడు కిలోమీటర్ల దూరంలో గల గ్రామాలను విలీనం చేశారు. దీంతో అక్కడి కూలీలకు ఉపాధి హామీ పనులు లేకుండా పోయాయి. అంతేకాకుండా పన్నుల భారం కూడా పెరిగింది. ఈక్రమంలో ము న్సిపాలిటీలో కలిపిన తమ గ్రామాలను తిరిగి పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
పంచాయతీలుగా మార్చాలని తీర్మానాలు
తాజాగా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీని గ్రామ పంచాయతీగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పొచంపల్లి, ముక్తాపూర్, రేవణపల్లిని పంచాయతీలుగా మర్చాలని జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేసి గ్రామపంచాయతీలుగా పునరుద్ధరించాలని తీర్మానించారు. అదేవిధంగా ఆలేరు మున్సిపాలిటీ పరిఽధిలో చేర్చిన బహుద్దూర్‌పేటను తిరిగి పంచాయతీగా చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే ఆలేరు శివారులోని సాయిగూడేన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ప్రకటించగా.. ఆలేరును సైతం గ్రామ పంచాయతీగా చేయాలని డిమాండ్ వస్తోంది. మోత్కూరు మున్సిపాలిటీలోని కొండగడపను గ్రామపంచాయతీ చేయాలంటున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజి గూడెం, తాళ్ల సింగారంలను గ్రామ పంచాయతీలుగా చేయాలని అక్కడి ప్రజలు బలంగా కోరుతున్నారు.
మున్సిపాలిటీల్లో కలిసిన గ్రామాలు
మున్సిపాలిటీ కలిసిన గ్రామాలు
ఆలేరు బహదూర్‌పేట
చౌటుప్పల్ లక్కారం, తంగ ఛిపల్లి,
తాళ్లసింగారం, లింగోజిగూడెం
మోత్కూర్ కొండగడప, బుజిలాపురం
పోచంపల్లి ముక్తాపూర్, రేవణపల్లి
కోర్టుకు వెళ్లినా ఫలితం లేదు
పోచంపల్లి మున్సిపాలిటీలో ముక్తాపూర్ గ్రామాన్ని కలపొద్దని కోర్టుకు వెళ్లాం. కానీ మా గ్రామాన్ని విలీనం చేశారు. దీంతో ఉపాధి హామీ పథకం వర్తించక 1200 మంది ఉపాధి కోల్పోయారు. మున్సిపాలిలో చేరిన తర్వాత ఇంటి నిర్మాణానికి అనుమతి కావాలంటే రూ.లక్షలు ఖర్చు అవుతున్నాయి. గతంలో గ్రామపంచాయతీలో రూ.3వేలు ఖర్చయ్యేది. అఖిల పక్షం సమావేశంలో గ్రామ పంచాయతీ కావాలని తీర్మానం చేశాం.
– బాలచంద్రం గౌడ్, మాజీ సర్పంచ్
ముక్తాపూర్, పోచంపల్లి మండలం
ఫ గ్రామ పంచాయతీలుగా మార్చాలని డిమాండ్ చేస్తున్న విలీన గ్రామాల ప్రజలు
ఫ ఉపాధి హామీ పనులు లేవని, పన్నుల భారం పెరుగుతోందంటున్న గ్రామస్తులు
ఫ జీపీలుగా పునరుద్ధరించాలని
తీర్మానాలు
Comments
Please login to add a commentAdd a comment