ఆహార నియమాలు తప్పనిసరి
చౌటుప్పల్ రూరల్ : చలికాలం వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆహారజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు..న్యూట్రిషనిస్టు ఎస్.రమ్య.
● విటమిన్ డి చాలా అవసరం. ఉదయం పూట పది నిమిషాలైనా ఎండలో ఉండాలి. సాధ్యం కాకపోతే డి విటమిన్ అధికంగా లభించే గుడ్లు, పాలు, పాల పదార్థాలు తీసుకోవాలి.
● కాస్త చల్లటి పదార్థం తీసుకున్నా జలుబు, దగ్గు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీంతో శరీరానికి మేలు చేసే క్రిములు, బ్యాక్టీరియాలు బయటకు పోయి రోగనిరోధశక్తి తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెంచడానికి క్యాబేజీ, నిమ్మజాతి పండ్లు, చిలగడదుంప, తృణధాన్యాలు తీసుకోవాలి. రోజూ ఉదయం కప్పు గ్రీన్‌టీ లేదా అల్లంటీ తాగాలి.
● తాజా కూరగాయలు, మొలకెత్తిన గింజలు, బీన్స్, మాంసం వంటి పదార్థాలతో తయారు చేసిన సూప్స్ వేడివేడిగా తీసుకోవాలి. తద్వారా ఇన్‌ఫెక్షన్లు సోకవు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఆహార పదార్థాల్లో
వెల్లుల్లి వేయాలి.
ఫ న్యూట్రిషనిస్టు రమ్య సలహా
Comments
Please login to add a commentAdd a comment