నల్లగొండ టౌన్ : నల్లగొండలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఓ కాంట్రాక్టర్ పారిశుద్ధ్య కార్మికులను వేధింపులకు గురిచేసిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి పది గంటల సమయంలో జీజీహెచ్‌లోని ఎంసీహెచ్ వార్డుల్లో పనులు చేస్తున్న కార్మికులను వేరే భవనానికి సంబంధించిన సూపర్‌వైజర్ వచ్చి ఫొటోలు తీశాడు. రాత్రి సమయంలో ఎందుకు ఫొటోలు తీస్తున్నారని కార్మికులు ఆయనతో వారించారు. దీనికి సూపర్‌వైజర్ వెంటనే కాంట్రాక్టర్‌కు ఫోన్లో సమాచారం ఇవ్వడంతో పదిన్నర తరువాత ఆసుపత్రికి వచ్చిన కాంట్రాక్టర్ వెంటనే మహిళ కార్మికులు వేచి ఉండే గదికి వెళ్లాడు. ఆస్పత్రి నాది నా ఇష్టం వచ్చిన వారు ఇక్కడ డ్యూటీలు చేస్తారు.. మీరు ఎవరూ? అంటూ వారిపై కేకలు వేశాడు. వెంటనే సబిత అనే కార్మికురాలితో ‘నిన్ను విధుల్లో నుంచి తొలగిస్తున్నాను.. రేపటి నుంచి రావద్దు.. 70 మందిని తీసేస్తే నాకు మరో 70 మంది వస్తారు. 70 లక్షలు వస్తాయి’ అంటూ దుర్భాషలాడాడు. దీంతో మహిళ కార్మికురాలు ఎంత బతిమాడిని వినకుండా వెళ్లిపోవాలని హుకుం జారీ చేశాడు. దీంతో సదరు కార్మికురాలు ఉద్యోగం పోయిందని తీవ్ర మనోవేధనకు గురికావడంతో ఆమె బీపీ 200కు పెరిగి కింద పడిపోయింది. వెంటనే అక్కడున్న మిగతా సిబ్బంది ఆమెను అదే ఆస్పత్రిలో చికిత్స కోసం జాయిన్ చేశారు. దీంతో ఉదయం 7గంటల ప్రాంతంలో డ్యూటీ షిఫ్టింగ్ సమయంలో మిగతా కార్మికులు అందరూ వచ్చారు. ఈ విషయం బయటకు రావడంతో కాంట్రాక్టర్ వేధింపులకు నిరసనగా పారిశుద్ధ్య కార్మికులు గురువారం ఉదయం తమ విధులను బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. అర్ధరాత్రి సమయంలో చాలాసార్లు వచ్చి ఇలా వేధింపులకు గురిచేస్తాడని, ఉదయం నుంచే విధులకు రావద్దంటూ ఆదేశాలు ఇస్తారని.. తాగివచ్చి కూడా అనేకమార్లు ఇష్టనుసారంగా మాట్లాడుతారని కార్మికులు ఆరోపించారు. వెంటనే కాంట్రాక్టును రద్దు చేసి తగిన న్యాయం చేయాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉదయం 7 గంటల నుంచి పదిన్నర వరకు ఎంసీహెచ్ మెయిన్ గేట్ ఎదుట ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న ఆస్పపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి కార్మికులను పిలిచి ఆందోళన విరమించాలని కోరారు. కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేసి వెంటనే సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు.
ఫ నల్లగొండ జీజీహెచ్‌లో రాత్రి వేళ
ఫొటోలు తీసిన సూపర్‌వైజర్
ఫ ఎందుకని ప్రశ్నిస్తే..
విధుల్లో నుంచి తొలగించిన కాంట్రాక్టర్
ఫ ఎంసీహెచ్ ఎదుట కార్మికుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment