కొనసాగుతున్న జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు
భువనగిరి: పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మైదానంలో జిల్లా స్థాయి సీఎం కప్–24 క్రీడా పోటీలు కొనసాగుతున్నాయి. గురువారం ఖోఖో, రోవింగ్, షూటింగ్, స్నూకర్, జిమ్నాస్టిక్ తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, దిడ్డి బాలాజీ, ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి శ్యాంసుందర్ హాజరై క్రీడలను ప్రారంబించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు, యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కరుణ్, ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణమూర్తి, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గోపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment