లక్ష్యానికి చేరువలో ఆయిల్‌పామ్
ఆత్మకూరు(ఎం): ఆయిల్ పామ్‌కు మంచి డిమాండ్ ఉండటంతో రైతులు ఈ మొక్కలు సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఐదు నెలల క్రితం అయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ. 13,210గా ఉంది. ప్రస్తుతం టన్నుకు రూ.20,413 వరకు పెరిగింది. ఒకసారి నాటితే మూడున్నర సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు దిగుబడి వస్తుండడంతో ఆయిల్‌పామ్ సాగును లాభాసాటిగా రైతులు గుర్తిస్తున్నారు.
ఆయిల్ పామ్‌కు ప్రభుత్వం ప్రోత్సాహకంగా రాయితీలు అందజేస్తుండడంతో జిల్లాలో సాగు విసీ్త్రర్ణం లక్ష్యానికి చేరుకుంటుంది. జిల్లాలో 8వేల ఎకరాలు ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 4255 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 2022–23లో ఆయిల్ పామ్ సాగును జిల్లాలో ప్రారంభించగా మొదటగా 1428 ఎకరాలను 285 మంది రైతులు సాగు చేశారు. 2023–24లో 2,107 ఎకరాలను 533 మంది రైతులు సాగు చేశారు. 2024–25లో అందుకు భిన్నంగా 720 ఎకరాల్లో 90 మంది రైతులు సాగు చేస్తున్నారు. ఇంకా 3500 ఎకరాలకు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వారికి ఇంకా మొక్కలు పంపిణీ కాలేదు.
ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు
ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం ఆయిల్ ఫెడ్ ద్వారా పలు విధాలుగా రాయితీలు కల్పిస్తోంది. అదేవిధంగా రైతులకు సబ్సిడీపై డ్రిప్ మంజూరు చేస్తోంది. రెండున్నర ఎకరాలకు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ రైతులకు 90 శాతం, ఓసీ(5 ఎకరాల లోపు)లకు 90 శాతం సబ్సిడీపై డ్రిప్ అందిస్తారు. ఆయిల్ పామ్ సాగు నుంచి నూనె కర్మాగారాలకు దూరాన్ని బట్టి ట్రాన్స్‌పోర్ట్ చార్జీలను టీజీ ఆయిల్ ఫెడ్ చెల్లిస్తుంటుంది. ఈ సాగులో అంతరపంటలు పండించినందుకు, ఎరువుల ఖర్చులకు ఎకరాకు రూ.4200లు అందజేస్తారు. ఇప్పటివరకు 2022–23లో 285 మంది రైతులకు రూ.59లక్షలు, 2023–24లో 537 మంది రైతులకు రూ.88లక్షలు అందించారు. అయితే 2024–25కు సంబంధించి 720 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న 90 మంది రైతులకు రాయితీ ఇంకా అందలేదు. ఎకరానికి రూ.4200ల చొప్పున రూ. 30లక్షలు అందజేయాల్సి ఉంది. ఈ రాయితీలను అందించడానికి అధికారులు సర్వే చేస్తున్నట్లు తెలిసింది.
ఫ సాగు లక్ష్యం 8వేల ఎకరాలు
ఫ ఇప్పటివరకు జిల్లాలో
సాగులో ఉన్నది 4255 ఎకరాలు
ఫ మరో 3500 ఎకరాలకు
రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు
Comments
Please login to add a commentAdd a comment