కమ్యూనిస్టులు దేశానికి దిక్సూచి
భువనగిరిటౌన్: కమ్యూనిస్టులు దేశానికి దిక్సూచి అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నల్లగొండలో బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. సమ సమాజ స్థాపనకు, దోపిడీ లేని సమాజం నిర్మించేందుకు సీపీఐ అనేక పోరాటాలు చేసిందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడుతూ.. భూ పోరాటాలు చేసి లక్షల ఎకరాలు నిరుపేదలకు పంపిణీ చేసిన ఘనత కమ్యూనిస్టు పార్టీదేనన్నారు. కమ్యూనిస్టు పార్టీ లక్ష్యసాధనకు సంఘటితంగా ప్రజా ఉద్యమాలు నిర్వహించాలన్నారు. నల్లగొండలో జరిగే బహిరంగ సభకు జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి, నల్లగొండ మాజీ పార్లమెంట్ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యుడు సాంబశివరావు, ఉమ్మడి జిల్లా నాయకులు హాజరుకానున్నారని తెలిపారు. ఏశాల అశోక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర నాయకుడు ఉజ్జిని రత్నాకరరావు సహాయ కార్యదర్శిలు యానాల దామోదర్ రెడ్డి, బోలగాని సత్యనారాయణ, బచ్చనగోని గాలయ్య, సుదర్శన్, వెంకటేష్ పాల్గొన్నారు.
ఫ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు
పల్లా వెంకట్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment